రామ్ చరణ్‌తో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరు..? రోజుకు రూ.4 లక్షలు తీసుకుంటున్న ఆఫ్రికన్ బాడీగార్డ్ గురించి తెలుసా?

రామ్ చరణ్‌తో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరు..? రోజుకు రూ.4 లక్షలు తీసుకుంటున్న ఆఫ్రికన్ బాడీగార్డ్ గురించి తెలుసా?
ప్రస్తుతం “పెద్ది” సినిమా ప్రమోషన్లతో దేశవ్యాప్తంగా సందడి చేస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడ కనిపించినా ఆయనతో పాటు ఓ భారీ కాయంతో ఉన్న వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో చాలామంది “ఈ వ్యక్తి ఎవరు?” అంటూ వెతకడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ వ్యక్తిగత భద్రత కోసం ప్రముఖ ఆఫ్రికన్ MMA ఫైటర్ కెవిన్ కుంటాను ప్రత్యేకంగా నియమించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం “పెద్ది” సినిమా ప్రమోషన్ టూర్‌లో చరణ్ భద్రత బాధ్యతలను కెవిన్ కుంటా పర్యవేక్షిస్తున్నాడు. ఆయనకు రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పారితోషికం అందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌లో కెవిన్ కుంటా ఒకరిగా నిలుస్తారు. దీంతో ఇప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఇటీవల రామ్ చరణ్ పాల్గొన్న ప్రతి పబ్లిక్ ఈవెంట్‌లో కెవిన్ కుంటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అభిమానుల రద్దీని నియంత్రించడం నుంచి చరణ్ చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడం వరకు ప్రతి విషయాన్ని ఆయన ఎంతో ప్రొఫెషనల్‌గా నిర్వహిస్తున్నాడు.
అయితే కేవలం భద్రత మాత్రమే కాదు.. కెవిన్ కుంటా స్టైల్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ సాధారణ లుక్‌లో కనిపిస్తుంటే, కెవిన్ మాత్రం స్టైలిష్ సూట్లలో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్‌కు కూడా ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది.
కెవిన్ కుంటా అసలు గాంబియా దేశానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో నివసిస్తున్నాడు. ప్రొఫెషనల్ MMA ఫైటర్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన, VIPలు మరియు ప్రముఖులకు భద్రత కల్పించే క్లోజ్ ప్రొటెక్షన్ సర్వీసెస్‌లో కూడా అనుభవం కలిగి ఉన్నాడు.
2021లో ఇటలీ జాతీయ MMA జట్టులో కూడా కెవిన్ కుంటా సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం. ఫిట్‌నెస్ విషయంలో ఎంతో కఠినంగా ఉండే ఆయన, ఏడాది పొడవునా అద్భుతమైన ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తుంటాడు. అందుకే ఆయన వ్యక్తిత్వం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు కారణమైంది.
ఇక రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు, రవికిషన్, బోమన్ ఇరానీ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.






