బొలిశెట్టి గారి గండికోట జమ్మలమడుగు ఆకస్మిక పర్యటన
నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్యనారాయణ, సీనియర్ నేత పి.వి.ఎస్ మూర్తి, రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కార్యదర్శి సుంకర శ్రీనివాస్ జమ్మలమడుగు ఆకస్మిక పర్యటనపై విలేఖర్ల సమావేశం…
పునరావసం కల్పించకుండా వెళ్ళమంటే ముంపు వాసులు ఎక్కకిడి వెళ్తారు?
నీళ్లు వదిలేస్తాం ఎక్కడికి వెళ్తారో సంబందం లేదని కలెక్టర్ చెప్పడం అతని బాధ్యతా రాహిత్యమే
1894 భూసేకరణ చట్టం ఆర్టికల్ 24 (2) ప్రకారం భూసేకరణ జరిగి 5 సంవత్సరాలు ఆ భూమిని సంబంధిత ప్రోజెక్ట్ కోసం వినియోగించక పోతే
చట్ట ప్రకారం ఆభూసేఖరణ చెల్లదు.
పరిహారం అందించక పోగా దౌర్జన్యంగా తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామ ప్రజల జీవించే హక్కుకి భంగం కలిగిస్తున్న అధికారులను తక్షణం తొలగించక పోతే ప్రభుత్వం “చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తి తన జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు” అన్న రాజ్యాంగంలో ఆర్టికల్ 21 పౌరుల ప్రాథమిక అతిక్రమించినట్టు అవుతుందని గుర్తించాలి.
ఉన్న ఫలంగా వెళ్లాలంటే పిల్లలను పశువులను తీసుకోని ఎక్కడికెళ్తారు?
సీఎం ఇంట్లో పశువులను కట్టాలా?
ప్రజలను ముఖ్యంగా బడుగు వర్గాలను పశువుల కన్నా ఘోరంగా చూస్తున్నదీ ప్రభుత్వం.
భయబ్రాంతులకు గురి చేసి ప్రజలను తరిమేయడం తప్పు.. జనసేన ప్రజల పక్షాన నిలిచి న్యాయం జరిగే వరకూ పోరాడుతుందనీ అన్నారు
ఒక ప్రశ్నకు సమాధానంగా
మతం మీద జరుగుతున్న దాడిలో తన నిజాయితీ సీఎం నిరూపించుకోవాలి అని, అందువల్ల అంతర్వేది ఘటనపై తన మతాన్ని నిరూపించుకోవాలి..
అవినీతి ఆరోపణలు లేని అధికారులను మార్చడం వెనుక కుట్ర..
అన్యమతస్తుడైన జగన్ గారు తన నిజాయితీ నిరూపించుకోవాలి..
పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన వెంటనే ఇవోపై బదిలీ చేయాల్సింది పోయి కమీషనర్ పై చర్య తీసుకోవడం ఏమిటి..
ప్రజలు తిరగబడక ముందే ప్రభుత్వం మెల్కోవాలి..
రాష్ట్రం అరాచక పాలన, రాక్షస పాలన సాగుతోంది
సమాజంలో నీతి న్యాయం మిగిలిదంటే మీడియా కృషి పలితమే..
జగన్ చెప్పేదోకటి చేసేదోకటి..
వారం రోజులుగా అందోళన చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తోంది..
ఇదే విధమైన పాలన సాగిస్తే ప్రభుత్వ మనుగడకే ప్రమాదం..
మానవ హక్కుల ఉల్లంఘనను మీడియా పోరాటం చేయాలి..
నిర్వాసితుల పక్షాన కోర్టుకు వెళ్తాం..
సింగూరు సంఘటనే ఇందుకు నిదర్శనం..
గ్రామసభలు నిర్వహించకుండా ల్యాండ్ అక్విజేషన్ ఎలా చేస్తారు..
నిర్వాసితుల పట్ల అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న ఆర్డీవో నాగన్నను తక్షణం విధుల నుండి తప్పించి శిక్షించాలి అని బోలిశెట్టి సత్యనారాయణ అన్నారు