State Finance Minister Harish Rao distributed CMRF checks.

Spread the love

State Finance Minister Harish Rao distributed CMRF checks.

ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

బుధవారం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 63 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల 66 వేల 500 రూపాయల మేర సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద‌లు సాయం.. పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్ధిపేట నియోజకవర్గమే నిదర్శనమని మంత్రి చెప్పారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. వీరిలో పట్టణానికి చెందిన 26 మందికి 6 లక్షల 75 వేల 500, సిద్ధిపేట రూరల్ మండలంలోని 10 మందికి రూ.2 లక్షల 37 వేలు, సిద్ధిపేట అర్బన్ మండలంలోని 4 మందికి 1 లక్షా 5వేల 500, చిన్నకోడూర్ మండలంలోని 7 మందికి 2 లక్షల 12 వేలు, నంగునూరు మండలంలోని 10 మందికి 2 లక్షల 43 వేల 500, నారాయణ రావు పేట మండలంలోని 6 మందికి 93 వేల చొప్పున్న మొత్తం రూ.15 లక్షల 66 వేల 500 రూపాయలు మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామ ప్రజాప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *