రాశి ఫలాలు 07-08-2020

Spread the love

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌
_ 07.08.2020_ భృగు వాసరే
రాశి ఫలాలు

🐐 మేషం
ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలుచేస్తాయి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఉత్సాహంతో ముందుకు సాగండి. సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. లేనిపోని అనుమానాలతో కాలయాపన చేయకండి. గోవింద నామాలు చదవాలి.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
మధ్యమ ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిర బుద్ధితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. కలహాలు సూచితం. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది.
చంద్ర శ్లోకం చదవండి.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
గ్రహబలం తక్కువగా ఉంది. మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శ్రీరామ నామాన్ని జపించాలి.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
మంచి కాలం. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల సౌఖ్యం ఉంది. ఇష్టదైవ స్తుతి శక్తినిస్తుంది.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
సమాజంలో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి.
లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
💃💃💃💃💃💃💃

తుల
చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
మనస్సౌఖ్యం ఉంది. బుద్దిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్య, వినోద సుఖం ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
మనోబలాన్ని కోల్పోరాదు. మంచిపనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది.
శని ధ్యానం శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
మీ అభివృద్దికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబములో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
మీమీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధికై చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవంతు 👌
🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *