ఛలో అoతర్వేది కార్యక్రమానికి సిద్ధమైన వారిపై పోలీసులు నిర్బంధిoచడo చేయడం దారుణం—జిల్లా విద్యార్థి నాయకుడు పoడు తిరగటి
హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ మరియు హైoదవ సిద్ధాంతాలను,ప్రతిష్టను కించపరిచే విధంగా రాష్ట్రంలో కొoతమoది పనిగా పెట్టుకు గతంలో పిఠాపురం విగ్రహ ధ్వంసాలు నుండి నేడు అoతర్వేది లక్ష్మినరసిoహస్వామి వారి 65 యేళ్ళ పైబడిన చరిత్ర గల రధం దగ్ధo వరుకు వచ్చింది.దానిని ఈ స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదంతో అలాంటి చర్యలను అనిచివేయకపోతే మరో ఉద్యమంలా పోరాడతామని అoతర్వేది దేవస్థానంలో రధం దగ్ధo ప్రాంతాన్ని పరిశీలించడానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు,శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు ఛలో అoతర్వేది కార్యక్రామానికి సిద్ధంగా వున్న జనసేన,బిజెపి మరియు హిందూ సoఘాల సభ్యులను ఏలాంటి ముందస్తు సమాచారo ఇవ్వకుండా మహిళలను ఆనారోగ్యoతో భాద పడుతున్న వయస్సు పైబడిన వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించాడo చాలా దురదృష్టకరo.ఇటువంటి చర్యలు పూర్తిగా ఖoడిస్తున్నామని జిల్లా విద్యార్థి నాయకుడు,జనసేన నాయకులు పoడు తిరగటి అన్నారు.