విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గ0లోగిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు..
ప్రభుత్వాలు మారుతున్న గిరిజనుల తలరాత మారటంలేదు.
అరకును భారతదేశంలో రెండో ఊటి అని బయట ప్రపంచానికి తెలుసు…
కానీ అదే కొండల్లో నివసించే గిరిజనులు తరుచూ మౌళిక సదుపాయాలు లేకుండా నరకయాతన అనుభవిస్తున్నారు….
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరకు టూరిజంపై పెట్టిన దృష్టి అక్కడ నివసించే అభాగ్య గిరిజనుల బతుకుల అభివృద్ధి పై చూపకపోవడం సిగ్గుపడాల్సిన విషయం..
ఏదైతే అరకు టూరిజంపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుపెడుతున్నాయో అందులో కొంత భాగమైన అక్కడే నివసిస్తున్న గిరిజనం విద్య, వైద్యం. రహదారి. అక్కడినదులపై వంతెన లాంటి కనీస అవసరాలపై దృష్టి పెట్టాలి.
1/70చట్టాన్ని ఆ ప్రాంతంలో సక్రమంగా అమలు చేయాలి..
ఇదే విషయం పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరకు ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. తరుచూ అక్కడి ఆదివాసీలు ఉద్యమాలు చేపడుతున్న
కనీసం ఏ.ప్రభుత్వం.. స్పందించట0లేదు.
ముంచంగిపుట్టు మండలం
కుమడ పంచాయతీ ఆంధ్ర ఒడిశా సరిహద్దు అయిన కెందుగూడ, సిర్లీమెట్ట, డెంగగూడ, కిముడుపుట్టు, పిట్టగెడ్డ గ్రామాల ఆదివాసులు మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్య వైద్యం, రోడ్లు రవాణా సదుపాయాలు కల్పించాలని ఆందోళన
నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం..ఎంపీ, ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించాలి.
తుమ్మి అప్పలరాజు దొర
ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు