మానవత్వం చాటుకున్న కార్పొరేటర్ హేమ సామల గారు

Share this news

Corporator Hema Samala, who expressed humanity

మానవత్వం చాటుకున్న కార్పొరేటర్ హేమ సామల గారు

ఈ నెల (సెప్టెంబర్) 16 తేదీ న సోషల్ మీడియా ట్విట్టర్ లో సీతాఫల్మండి డివిజన్లో ఆంధ్ర కి సంబంధించిన 72 సంవత్సరాల ఒంటరి మహిళ కరోనాతో బాధపడుతోందని సమాచారం అందింది. వెంటనే హేమ సామల గారు స్పందించి ఆమెను హాస్పటల్లో అడ్మిట్ చేయడం జరిగింది డాక్టర్ల సలహాలు సూచనలతో ఆమె పూర్తిగా కోలుకొని ఈరోజు డిశ్చార్జ్ కావడం జరిగింది. ఆమెకు వైద్య సేవలు చేసిన వైద్యులు డాక్టర్ శంకర్ గారికి ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో వయసు ఎక్కువగా ఉన్న వారు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్ళకూడదని సూచించారు. మన ఆరోగ్యం మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఇలాంటి కరోనా సమయాల్లో అందరు మానవత్వంతో ఉండాలని, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని ఇలా ఎంతో మంది చెపుతున్నారు. ఇలాంటి వారి స్ఫూర్తి అందరికి కలగాలని కోరుకుందాం.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *