పేద రోగులకు ఉచితంగా కోవిద్ ప్లాస్మా – Megastar Chiranjeevi

పేద రోగులకు ఉచితంగా కోవిద్ ప్లాస్మా – Megastar Chiranjeevi
Spread the love

పేద రోగులకు ఉచితంగా కోవిద్ ప్లాస్మా

పచ్చటి జీవితాలపై కర్కశ కరోనా పంజా విసురుతూ చిన్నాభిన్నం చేస్తుంది. అందులో పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతుంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు సమాయత్తమైంది.

కరోనా సోకి రోగ విముక్తులైనవారు ప్లాస్మా దానం చేస్తే మరికొంతమందికి ఆయుష్ష పోసినట్లే. ఈ నేపథ్యంలో పేదలైన కరోనా సోకినా రోగులకు ఉచితంగా ప్లాస్మా వితరణ చేసేందుకు చిరజీవి బ్లడ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది.
తెల్లరేషన్ కార్డుదారులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూన్న కోవిద్ పేషంట్లకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు ఉచితంగా ప్లాస్మా సరఫరా చేస్తుంది.

పేదలంతా ఈ అవకాశాన్ని ఉపచిగించుకోవలసిందినంగా విన్నపం.

22 సంవత్సరాలుగా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు ద్వారా ఉచితంగా రక్తనిధులు అందించారన్న విషయాన్నీ ఈ సందర్భంగా తెలియచేసేందుకు మిక్కిలి సంతోషిస్తున్నాము.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *