ట్విట్టర్ లో దుమ్ము దులుపుతున్న RRR మూవీ అప్డేట్

ట్విట్టర్ లో దుమ్ము దులుపుతున్న RRR మూవీ అప్డేట్
Spread the love

ట్విట్టర్ లో దుమ్ము దులుపుతున్న RRR మూవీ అప్డేట్

రాజమౌలి గారు తీసే సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే. అయన తీసిన మూవీ ఏదైనా హిట్ కాక తప్పదు. ఎన్నో సినిమాలు రాజమౌళి స్టాంప్ మీద హిట్లు కొట్టాయి.

గ్రాఫిక్స్ ను ఎలా వాడాలో, ఎలా పిండిలో ఆయనకు తెలిసినంత బాగా ఇంకా ఎవ్వరికి తెలియకపోవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు బాలీవుడ్ తో పాటుగా ప్రపంచంతో కూడా పోటీ పడుతూ ఉండేది. ఒకప్పుడు ANR, ఎన్టీఆర్, తరువాత వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు. రెమ్యూనరేషన్ లో చిరంజీవి గారు అమితాబ్ గారితో పోటీ పడ్డారంటే, చిరంజీవి గారి క్రేజ్ ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. తర్వాత వచ్చిన చాల సినిమాలు తెలుగు స్థాయిని పెంచాయి.

రాజమౌళి గారు తీసిన సినిమా బాహుబలితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాహుబలి 1 సినిమా బజరంగీ బైజాన్ బాలీవుడ్ మూవీ తో పోటీ పడింది. అయితే తెలుగు సినిమాకు అంత సీన్ ఉందా అని అనుకున్నారు కొంతమంది. కానీ ఎవరూ ఊహించనంత రిజల్ట్స్ మనకు బాహుబలి 1 ఇచ్చింది. దాంతో పాటుగా కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనేది ప్రపంచం మొత్తం చర్చ జరిగింది. ఆంటే ఆ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని గణనీయంగా పెంచారు రాజమౌలి గారు.

తర్వాత వచ్చిన బాహుబలి 2 గురించి చెప్పక్కర్లేదు. ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. ఇండియన్ సినిమా అంటే వేరే దేశాల్లో ఒక్క బాలీవుడ్ మాత్రమే అనుకునే వారికీ తెలుగు సినిమా దెబ్బ, రుచి ఏంటో బాహుబలి 2 తో మొత్తం అందరికి తెలిసివచ్చింది. రాజమౌళి గారు తీసిన మగధీర కానీ, బాహుబలి కానీ ఎంతో గ్రాఫిక్స్ తో కూడుకున్న సినిమాలు.

అందరు ఎదురుచూస్తున్నా తర్వాత మూవీ RRR గురించి మూవీ టీం ట్విట్టర్ ఖాతా లో అప్డేట్ ఇచ్చింది.

ఇప్పటివరకు మేము పెట్టిన పండగ శుభాకాంక్షలు చాలు. సినిమా అప్డేట్ కోసం మీరు చేసే ఎడిటింగ్ లు చాలు. మీ ప్రేమకు మేము చాలా ఆనందిస్తున్నాము. ఇక అసలైన టైం వచ్చేసింది. అసలైన అప్డేట్ రేపు రాబోతుంది. అని ట్వీట్ చేసారు.

దీంతో ఒక్కసారిగా ట్విట్టర్ దుమ్ము దులిపేస్తున్నారు. మెగా అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు మరియు రాజమౌళి గారి అభిమానులు. ట్రేండింగ్ లో దూసుకుపోతున్నది మూవీ అప్డేట్. ఇప్పుడే ఇలా ఉంటె రేపు వచ్చే అప్డేట్ ఎలా ఉండబోతుందో అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#WeRRRBack #RRRMovie

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *