03-02-2021 రాశి ఫలాలు – వీళ్ళందరికీ చాలా మంచిది
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌
03, ఫిబ్రవరి , 2021 సౌమ్య వాసరే
రాశి ఫలాలు
🐐 మేషం
ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. సౌభాగ్య ప్రాప్తి కలదు. అవసరానికి సాయం చేసేవారు ఉంటారు. యశోవృద్ధి కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. దుర్గా స్తోత్రం పఠించాలి.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో పక్కవారిని కలుపుకుపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. పెద్దల మనోభావాలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్టదైవారాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
మొదలుపెట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మంచిది.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
అందరినీ కలుపుకు పోవడం అవసరం. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తనతో మీ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం చదువుకోవాలి. ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో మీరు ఆశించిన సహాయం అందుతుంది. ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలు పొందుతారు. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా బాగుంటుంది.
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. మరింత మంచి జరగడానికి విఘ్నేశ్వర ధ్యాన శ్లోకాలు చదవాలి.
💃💃💃💃💃💃💃
⚖ తుల
కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తి కావు. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్తే మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
మంచి ఫలితాలు సాధించడానికి ఇది సరైన సమయం. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకు పోవడం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గణపతి ఆరాధన శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
పనిలో శ్రమ పెరిగినప్పటికీ మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలు తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మంచిగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
లక్ష్యానికి కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచి తూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. శివారాధన శుభదాయకం. .
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శుభ ఫలితాలు పొందడానికి వేంకటేశ్వర స్వామిని సందర్శించాలి
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. శత్రు నాశనం ఉంది. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈