Covid 19 Vaccine Registration Process in Telugu

Share this news

Covid vaccine registration: దేశవ్యాప్తంగా విజృంభణ కట్టడికి వ్యాక్సిన్ తీసుకోవడంతో కొంత తీవ్రత తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్న వేళ వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. సెకండ్‌వేవ్‌ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ మే 1వ తేదీ నుంచి క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్‌ పొందాలనుకునేవారు CoWIN వెబ్‌పోర్టల్‌లో తమ పేర్లను రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని అధికారులు స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన అందరికీ టీకా ఇవ్వడం వల్ల టీకా కేంద్రాలకు వచ్చే వాళ్లతో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున టీకా కోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసినట్లు అధికారులు తెలిపారు. నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవడం కుదరదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొవిన్ వెబ్‌సైట్‌లో టీకా కోసం ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో తెలుసుకుందాం..

Register in Cowin Website – follow below steps:

ముందుగా కొవిన్ పోర్టల్ (cowin.gov.in ) ఓపెన్ చేయాలి.

అనంత‌రం మొబైల్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.

మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని వెబ్‌సైట్‌లో ఎంట‌ర్ చేసి, వెరిఫై బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేష‌న్ ఫ‌ర్‌ వ్యాక్సినేష‌న్ అని పేజి ఓపెన్ అవుతుంది.

అందులో ఫొటో గుర్తింపు కార్డును ఎంచుకుని దాని నంబ‌ర్‌తో పాటు పేరు, పుట్టిన సంవ‌త్సరం వంటి వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.

ఏ గుర్తింపు కార్డులో ఉన్నట్లు వివరాలు నమోదు చేశారో దాన్ని అప్‌లోడ్‌ చేయాలి.

రిజిస్ట్రేష‌న్ అనంత‌రం ఏ రోజు టీకా వేయించుకోవాలో షెడ్యూల్ చేసుకోవాలి.

ఇందుకోసం ముందుగా షెడ్యూల్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

అందులో మీ ఏరియా పిన్ కోడ్ ఎంట‌ర్ చేయ‌గానే.. అందుబాటులో ఉన్న టీకా కేంద్రాల జాబితా క‌నిపిస్తుంది.

వాటి ఆధారంగా తేదీ, స‌మ‌యాన్ని సెలెక్ట్ చేసుకుని క‌న్ఫార్మ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

తరువాత వ్యాక్సినేషన్‌ కేంద్రం ఎంచుకోవాలి. అది ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రం ద్వారా టీకా తీసుకోవచ్చు.

ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవ‌చ్చు.

ఏదైతే గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేశారో ఆ వివరాలతో వ్యాక్సినేషన్‌ కేంద్రానికి మీరు ఎంచుకున్న తేదీ, సమయానికి వెళ్లాలి.

అలాగే షెడ్యూల్ తేదీల‌ను కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది.

కొవిన్ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.

Website Links:

COWIN WEBSITE: https://www.cowin.gov.in/home

Self Registration for Vaccination:

https://selfregistration.cowin.gov.in/


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *