కడప జిల్లా మామిళ్లపల్లె ఘటనలో పలువురు మృతి బాధాకరం

కడప జిల్లా మామిళ్లపల్లె ఘటనలో పలువురు మృతి బాధాకరం
ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
-చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షులు
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లెలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముగ్గురాళ్ల గనిలో రాయి తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు పలువురు మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి నెలకొనడం బాధాకరం. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. లాక్ డౌన్ సమయంలో మైనింగ్ కు ప్రభుత్వం ఎలా అనుమతిచ్చింది? విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఎటువంటి పరిహారం ఇచ్చారో ఇక్కడ కూడా అదే విధమైన పరిహారం అందించి బాధిత కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. విధుల్లో ఉన్న కార్మికులకు రక్షణ కవచాలు అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.