ప్రభుత్వంతో చేతులు కలిపి విజయ్ దేవరకొండ చేస్తున్న రిక్వెస్ట్.
హీరో విజయ్ దేవరకొండ కూడా తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపారు. ప్రజల్లో కరోనా ట్రీట్‌మెంట్‌పై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే.. టెస్ట్ కోసం సమయాన్ని వృథా చేయకుండా వెంటనే ట్రీట్‌మెంట్ మొదలు పెట్టాలని సూచించాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడిన ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో పల్లెల్లో పట్టణాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో ప్రత్యేకంగా కోవిడ్ ఔట్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పిన విజయ్.. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే అక్కడ ఉన్న వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపించగానే టెస్ట్ కోసం సమయాన్ని వృథా చేయకుండా ట్రీట్‌మెంట్ మొదలు పెట్టాలని విజయ్ చెప్పుకొచ్చాడు.