Jr. NTR కు కరోనా పాజిటివ్, దయచేసి అందరూ ఇలా చేయండి అని అడుగుతున్నా ఎన్టీఆర్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని తారక్ తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ అన్ని కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తున్నట్లు వెల్లడించారు.తనతో పాటు కుటుంబ సభ్యులందరూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా తనను కాంటాక్ట్ అయినవాళ్లు వెంటనే టెస్టులు చేయించుకోవాలని ఎన్టీఆర్ సూచించారు.