10వ తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ జీవో

కరోనా కారణంగా 10వ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. FA మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉత్వర్వుల్లో తెలిపింది. కొవిడ్ కారణంగా టెన్త్ , ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు దీనికి సంబంధించి జీవో జారీ చేసింది. టెన్త్ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని తెలిపింది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తామని స్పష్టం చేసింది. జూన్ రెండో వారంలో సమీక్షించి సెకండ్ ఇయర్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని.. బ్యాక్‌లాగ్ ఉన్న సెకండ్ ఇయర్ విద్యార్థులకు కనీస పాస్ మార్కులు వేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
One thought on “10వ తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ జీవో”