ఏపీలో ఏప్రిల్ 7న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎన్నికల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పునిస్తూ… ఎన్నికలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ జరగలేదని కోర్టు స్పష్టం చేసింది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరపాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ పరిషత్ ఎన్నికలను సవాల్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కోర్టును ఆశ్రయించాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఫాలో కాకుండా ఎన్నికలు జరిగాయన్న ప్రతిపక్షల వాదనకు హైకోర్టు మొగ్గుచూపింది.
అయితే, ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో కానీ, సుప్రీం కోర్టులో కానీ సవాల్ చేసే యోచనలో ఉంది.