సీఎం, మంత్రులు ఒక్క ఆసుపత్రి ని అయినా సందర్శించారా

Spread the love

అనంతపురం: బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్.

ఈనెల 23 ఆదివారం ప్రభుత్వ వైపల్యాల పై బిజేపీ రాష్ట్ర వ్యాపితంగా నిరసన పాటిస్తున్నాం

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడు తున్నారు .

ప్రవేటు ఆసుపత్రుల దోపిడిలో అనేక మంది అధికార పార్టీ నేతలు హస్తం ఉంది .

కేంద్ర మార్గదర్శకాలు పాటించలేదు కాబట్టే కోర్టు ఎన్నికలు రద్దు చేసింది.

సీఎస్, ఎస్ ఈ సీ ల జీతం నుంచి వసూలు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి.

ఏపీలో అక్రమ అరెస్టులు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రోగులను ఆసుపత్రిలో కి అనుమతించకుంటే ఎందుకు సీఎం మాట్లాడారు.

ప్రభుత్వానికి వ్యతిరెకంగా ఈ నెల 23 న బీజేపీ నిరసన తెలపాలని నిర్ణయం.

సమస్యలపై స్పందించకుంటే మంత్రుల ఇల్లు ముట్టడిస్తాం.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోగులను రక్షించడం లో ప్రభుత్వం చేతులెత్తేసింది.

మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.. చేతుల్లో చర్యలు లేవు.

ప్రయివేటు ఆసుపత్రిలో లో ఎక్కడైనా 50 శాతం రోగులు చేర్చుకున్నట్లు ఏ ఒక్కరైనా నిరూపించ గలరా..

రాష్ట్రంలో 514 ప్రయివేటు ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించినట్లు చెబుతున్నారు. కనీసం 10 శాతం బెడ్లు కేటాయించలేదు.

ప్రభుత్వం ఇచ్చే ఆక్సిజన్, రేమిడిసివియర్ మందులు బ్లాక్ లో అమ్ముకొని దోపిడివచేసుకోవడానికి ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతోంది.

ఆసుపత్రుల్లో ఎక్కువ ఎంపీ, ఎమ్మెల్యేల బంధువులు, పెట్టుబడి పెట్టినవి ఉన్నాయి.

ప్రభుత్వం ఎందుకు ప్రయివేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవడం లేదు.

ఆక్సిజన్ కేటాయింపులతో దోపిడీ జరుగుతోంది.

కోవిడ్ తో జర్నలిస్టులు, జనం సచ్చిపోతున్నారు.

సీఎం, మంత్రులు ఒక్క ఆసుపత్రి ని అయినా సందర్శించారా…

బడ్జెట్ లో ఆరోగ్యానికి కేటాయింపు ఎంత. రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్ లో ఎంత కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఓ మోసం, బోగస్, ప్రజలను మభ్యపెట్టడమే.

మెడికల్ కళాశాల లకు బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *