మార్చి 17న ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలోనే కరోనా ముప్పు తొలగిపోలేదని ప్రధాని మోదీ అన్నారు
గ్రామాల్లోకి విస్తరించే ప్రమాదం ఉందని, కంటైన్మెంట్ కఠినతరం చేయాలని అప్పుడే చెప్పారు
కేంద్రం అప్రమత్తంగా చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు
కరోనా ప్రమాదం ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముందని కొందరు అంటున్నారు
ఎన్నికలు పెట్టొద్దన్ని ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా?
ఎన్నికలు వద్దని బెంగాల్‌లో టీఎంసీ చెప్పిందా? కేరళలో సీపీఐ(ఎం) చెప్పిందా? అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ చెప్పిందా?
కోర్టులు కూడా వ్యాఖ్యానాలు చేశాయి. కానీ ఏ కోర్టైనా ఎన్నికలు వద్దని చెప్పిందా? ఎవరైనా కోర్టుల్లో పిల్ దాఖలు చేశారా?
అనేక రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే వాటిని ఆపాలని ఏ పార్టీ అయినా డిమాండ్ చేసిందా?
స్థానిక సంస్థలు వాయిదా వేస్తామని యూపీ సర్కారు చెబితే, అలహాబాద్ హైకోర్టు ఒప్పుకోలేదు. ఎన్నికలు జరిపి తీరాల్సిందే అని ఆదేశించింది
కేవలం రాజకీయాల కోసం మోదీని అప్రతిష్టపాలు చేయడం కోసం మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు
ప్రపంచంలో నాలుగైదు దేశాలు మాత్రమే వ్యాక్సిన్లు తయారు చేశాయి
అమెరికా, చైనా, రష్యా, యూకే, ఇండియా వంటి దేశాలు మాత్రమే వ్యాక్సిన్లు తయారు చేశాయి
ఇప్పుడు వ్యాక్సిన్లు అందరికీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు, గతంలో ఏమన్నారో గుర్తుచేసుకోండి.
‘కోవాగ్జిన్’కి అత్యవసర అనుమతులు ఇవ్వడం ప్రమాదకరం, ఎలా అనుమతులు ఇస్తారని నానా రాద్ధాంతం చేశారు.
అఖిలేష్ యాదవ్ ‘కోవాగ్జిన్’ని బీజేపీ వ్యాక్సిన్ అని, దీన్నెవరూ వేసుకోవద్దని చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా?
వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా, చులకనగా మాట్లాడిన సిగ్గులేని రాజకీయ పార్టీలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నాయి
9 నెలల లోపే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే చెందుతుంది
నిజానికి ‘ఆరోగ్యం’ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం. అయినప్పటికీ కేంద్రం చొరవ తీసుకుని ముందుకొచ్చింది
రాష్ట్రాలు స్వయంగా వ్యాక్సిన్లను ఎందుకు సమీకరించుకోలేకపోతున్నాయి? సమాధానం రాష్ట్రాలు చెప్పాలి
ఢిల్లీ జనాభాతో సరిపడినంత ఉన్న దేశాలతో భారత్‌ను పోల్చి చూడడం సరికాదు
ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లో కరోనా మరణాల రేటు చాలా చాలా తక్కువ
మన దేశం కంటే ఆరోగ్య మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న దేశాల్లోనే అధిక మరణాల రేటు నమోదైంది
దేశంలో పంపిణీ జరిగిన ప్రతి 7 వెంటిలేటర్లలో ఒకటి ఏపీకి దక్కింది
రాష్ట్రంలో చాలా చోట్ల వెంటిలేటర్లను సరిగా ఉపయోగించడం లేదని సమాచారం ఉంది
కేసుల్లో ఏపీ 5వ స్థానంలో, మరణాల్లో 9వ స్థానంలో ఉంది
ఇంత దారుణ పరిస్థితి ఏపీలో ఎందుకు నెలకొంది?
నవరత్నాల పేరుతో గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది
ఏపీలో సరైన సంఖ్యలో టెస్టులు లేవు, ప్రభుత్వాసుపత్రుల్లో అధ్వాన్నంగా పరిస్థితి ఉంది
గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైద్య మౌలిక వసతులను ఎందుకు మెరుగుపర్చలేకపోయింది?
వ్యాక్సినేషన్ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
మాస్కు ధరించడం వంటి కోవిడ్ బిహేవియర్ రాష్ట్ర సీఎం, మంత్రులు ఎవరూ పాటించడం లేదు
వారికి కోవిడ్ భయం లేదా? లేక కోవిడ్ వైసీపీకి ప్రత్యేక మినహాయింపునిచ్చిందా?
ముఖ్యమంత్రి జనానికి ఇచ్చే సందేశం ఏంటి? ఏం సంకేతాలు పంపుతున్నారు?
ఏపీ సర్కారు బడ్జెట్లో పెట్టిన మొత్తం కంటే అదనంగా రూ. 2-3 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం
గత ఏడాది ప్రారంభంలో రాష్ట్రాలకు కరోనా కట్టడి అనుభవం లేదు కాబట్టి కేంద్రమే రంగంలోకి దిగి లాక్‌డౌన్ విధించింది.
గత ఏడాది చివరి నుంచే ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలో ఉన్నందున, రాష్ట్రాలకే సాధికారత అప్పగించింది
అందుకే ఈ ఏడాది లాక్‌డౌన్ విధించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకే కల్పించి, తద్వారా కరోనా కట్టడికి సహకరిస్తోంది
గత ఏడాది లాక్‌డౌన్ విధిస్తే తప్పుబట్టారు. ఈ ఏడాది మళ్లీ వారే (రాహుల్ గాంధీ) ఎందుకు విధించడం లేదని ప్రశ్నిస్తున్నారు