నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు
Spread the love

🐐🐂👩‍❤️‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌

26, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
వైశాఖమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

                   ⚜️

శివ రామ గోవింద నారాయణ మహాదేవా

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్

              ⚜️

రాశి ఫలాలు

🐐 మేషం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గారాధన శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఒక వ్యవహారంలో తగిన సహాయం అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేయగల్గుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గా ధ్యానం శుభప్రదం
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. ఎప్పటినుంచో చేయాలనుకున్న ముఖ్యమైన పని దాదాపుగా పూర్తయ్యే సమయం. మహాలక్ష్మి అష్టోత్తరము చదివితే మంచిది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
శుభకాలం. మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మీ బుద్ధిబలంతో.. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్ట దైవారాధన మంచిది.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు జరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మంచిది
💃💃💃💃💃💃💃

తుల
శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహాలు సూచితం. తోటివారితో వాదనకు దిగకుండా వారిని కలుపుకుపోవడం ఉత్తమం. గణేశుడి అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికి వేంకటేశ్వర స్వామిని పూజించాలి.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు తగ్గట్టుగా పెద్దలు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్తోత్రము పఠిస్తే బాగుంటుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
కార్యసిద్ధి ఉంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధిబలంతో తోటివారి మనసును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
మంచి మనసుతో నిర్ణయాలు తీసుకుంటూ.. ముందుకు సాగండి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన బాధ్యతలతో సమయాన్ని గడుపుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లలితా సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. సర్వత్రా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్మీ అష్టోత్తరం ఉత్తమ ఫలితాలనిస్తుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: