దుక్కుమాలిన వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం లో నడుస్తుంది – ఈటల రాజేందర్

దుక్కుమాలిన వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం లో నడుస్తుంది – ఈటల రాజేందర్
Spread the love

కమలపూర్ మండల కేంద్రంలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం అయిన ఈటల రాజేందర్.

దుక్కుమాలిన వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం లో నడుస్తుంది.
ఆర్థిక మంత్రిగా ఉండగా గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ, మిషన్ కాకతీయ బిల్లులు కష్టపడి ఇప్పించేవాడిని కానీ గత మూడేళ్లుగా ఏ బిల్లులు రావడంలేదు. పనులు చేసిన వారు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ హుజూరాబాద్ లో మాత్రం కోట్ల రూపాయలు ఇస్తామని కెసిఆర్ గారే చెప్తున్నారు. వరంగల్, సిద్దిపేట కి వచ్చిన కెసిఆర్ మాటలు వింటే ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం కెసిఆర్ అనుకొనేటట్టు, మాట ఇస్తే తప్పను అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆయన అసలు రంగు బయటికి తెలియదు. ఇక్కడ ఉన్న గ్రీన్ వుడ్ స్కూల్ లో పరకాల ఎమ్మెల్యేతో నీచపు నికృష్టపు పనులు చేయిస్తున్న వ్యక్తి కేసీఆర్. బాగరెడ్డి గొప్ప రాజకీయనాయకుడు. ప్రజాస్వామ్య విలువలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తులు ప్రజలను, ప్రజా స్వామ్య వ్యవస్థలను నమ్ముకుంటారు. కెసిఆర్ నమ్ముకునేది డబ్బును, కుట్రను, అవసరానికి మాట్లాడుకునే మోసాన్ని నమ్ముకుంటాడు తప్ప ధర్మాన్ని, ప్రజలను నమ్ముకొరు.

ఈ కుట్రలకు చరమగీతం పాడే నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం. వందలకొట్ల డబ్బులు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఎన్నికలు గెలవొచ్చుగాక కానీ ఇక్కడ ధర్మమే గెలుస్తుంది. ఇక్కడ డబ్బుకి, నిర్బంధాలకు, దబాయింపులకు ఆస్కారం లేదు. రక్తతర్పనం చేసిన గడ్డ హుజూరాబాద్ గడ్డ. కో అంటే కో అంటారు ఇక్కడ. నా మీటింగ్ కి కట్టలు తెంచుకొని వచ్చారు. ఉప్పల గడ్డ ఉద్యమాల గడ్డ. ఉద్యమసమయంలో ఉప్పల్ రైల్వే స్టేషన్ లో ధర్నా చేసినప్పుడు ఫైరింగ్ చేస్తామన్నా కూడా లెక్కచేయని గడ్డ. కానీ కెసిఆర్ గారు మీరు చేస్తుంది ఎంటి. ఒడ్డు ఎక్కే దాకా ఓడ మల్లన్న ఒడ్డు ఎక్కాక బోడ మల్లన్న మీ నైజం. చెప్పడానికే శ్రీరంగ నీతులు. ఒకప్పటి నీ సహచరుడుగా నేను అడుగుతున్న 2006 లో నీవెంట ఉన్నది ఎవరు, మేము కాదా ? అప్పటి ప్రభుత్వం ఎంత మందిని కొన్నా ప్రజల ఎలా వెంట ఉన్నారో, ఇప్పుడు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చి మభ్య పెట్టినా ప్రజలు నా వెంటే ఉంటారు. పోలీస్, టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులు, TNGO ఉద్యోగులు రాజేందర్ అన్న గెలవాలనే అనుకుంటున్నారు. ఆత్మగౌరవం గెలవాలని అనుకుంటున్నారు. ఈ ఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ఈ ఎన్నిక గెలిస్తే గెలిచేది ఈటెల రాజేందర్ కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వారందరూ హుజురాబాద్ లో ఏం జరుగుతుంది అని ఎదురుచూస్తున్నారు. ఈ అహంకారం ఒడిపొకపోతే తెలంగాణ కు అరిష్టం అనుకుంటున్నారు. చారిత్రాత్మక సన్నివేశంలో మనం ఉన్నాము. ప్రతి ఇంట్లో ఉన్న యువకుడు నా కథానాయకులు. నాయకులు అమ్ముడు పోవచ్చు కానీ ప్రజలంతా మీ వెంట ఉన్నామని చెప్తున్నారు. తెలంగాణ ఆకలితో ఉంటుంది కానీ అతంగౌరవం చంపుకోదు.


ప్రభుత్వం పేదల కోసం ఉంటుంది కానీ డబ్బున్న వాడి కోసం కాదు. ఈటెల రాజేందర్ పెన్షన్, రైతు బంధు వద్దు అన్నారని ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ యువకులు బ్రతకడం కోసం లక్ష రూపాయల బ్యాంక్ రుణం ఇవ్వడం లేదు. కానీ ఇన్కం టాక్స్ కట్టే వాళ్ళకి కూడా ఆరు నెలలకు ఒకసారి 4 లక్షలు రూపాయలు ప్రభుత్వమే ఇవ్వడం న్యాయమా అని అడిగిన. నాకు వచ్చిన డబ్బులు పెట్టి పేదవారికి కంప్యూటర్ కొనిపిచ్చిన. పేద వారి వైద్యం కోసం ఖర్చుపెట్టిన. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వందల ఎకరాలు భూమికి కూడా రైతు బంధు చెల్లించడం సమంజసమా అని అడగడం తప్పా ?


ఇవ్వాళ కూడా అంటున్న రైతుబందు పేదవాడికి ఇవ్వు కానీ డబ్బున్నొడికి ఇవ్వొద్దు అని చెప్పిన.
రైతుల పంటకు గిట్టుబాటు ధర అందాలి అని గట్టిగా చెప్పిన ఇది తప్పా?


ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు ఆ నాయకులు నా దగ్గరకి వచ్చినప్పుడు సంఘాలు ఉంటాయి అని బరాబార్ చెప్పిన. కెసిఆర్ పుట్టక ముందు నుండే సంఘాలు ఉన్నాయి.


ఇలాంటి విషయాలు అన్నీ కెసిఆర్ గారికి చెప్పే ప్రయత్నం చేసిన, వినకపోతే బయటికి వచ్చి మాట్లాడిన.


2016 లో మున్సిపల్ కార్మికులను ఒక్క కలంపోటుతో అందరినీ తీసివేస్తే కెసిఆర్ గారిని అలా చేయడం సబబు కాదు అని చెప్పినా వినకపోతే వారి సభకు వెళ్లి నేను మీకు అండగా ఉంటానని చెప్పిన. నేను ఉద్యమకారుని నుండి మంత్రి అయిన వాడిని. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అయిన. తెలంగాణ లో సంఘాలు పెట్టించింది మేము. ఒక ఉద్యమ ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తివేసిన చరిత్ర మీది. ఉద్యమంలో సంఘాలు కావాలి, ఇప్పుడు మీకు కావలసింది బానిసలు. ఎమ్మెల్యే నాయకులు బానిసలు అయ్యారు అంటే పదవుల కోసం అనుకోవచ్చు. కానీ ఐఏఎస్ అధికారులు మీకు ఏమైంది.


కెసిఆర్ రాజ్యాంగం అమలు అవుతుందా ?
కురుస నాయకులు వస్తారు. పరకాల ఎమ్మెల్యే డబ్బులతో గెలిచిండు. కానీ నా ఆరు సార్ల ఎలక్షన్ లో ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క చుక్క మందు పెంచలేదు. 365 రోజులు అందుబాటు లో ఉన్న. మీ కళ్ళలో కదలాడే బిడ్డ అని ఓటు అడిగిన. ఇప్పుడు హుజూరాబాద్ లో చీకటి అధ్యాయానికి తెర లేపారు. కుల సంఘాల ను, నాయకులను తీసుకుపోతున్నారు సిద్దిపేటలో అడ్డా పెట్టారు డబ్బులు ఇస్తున్నారు. తెచ్చుకోండి ఆ డబ్బు వారి అయ్య సొత్తు కాదు. కానీ ఓటు మాత్రం ధర్మం తప్పకుండా వేయండి.


దొంగ ముఖాలు వస్తున్నారు. ఇక్కడ కి వస్తున్న ఎమ్మెల్యే ల్లారా మీ నియోజక వర్గంలో పెంచన్లు, కార్డులు ఇప్పించుకొండి నా దగ్గర ఎం పని మీకు.
ఈ నియోజక వర్గంలో నా మనిషికి ఇబ్బంది పెడితే మాడి మషి అయిపోతారు. అధికారులు బానిసలుగా మారి భాధ్యత మర్చిపోతే కటువుగా ఉంటుంది.
ఇక్కడ ప్రచారానికి వచ్చి వెళ్లిన సురేష్ యాదవ్ మీద సూర్యాపేట లో దాడి చేసినట్టు తెలిసింది. తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
2023 లో తెలంగాణ గడ్డ మీద గెలిచేది బీజేపీ, అది ఎంతో దూరంలో లేదు..


Spread the love

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *