రాజన్న సిరిసిల్ల, గంభీరావుపేట మండలం, రాజుపేటలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…
70 ఏండ్లలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను ఏడేండ్లలో చేసి చూపించామని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఆసరా పెన్షన్లు 10 రెట్లు పెంచామని పేర్కొన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి త్వరలోనే పెన్షన్లు ఇస్తామన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మానేరు నిండిందన్నారు. చెరువుల నిండా నీళ్లు ఉండటంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం వచ్చినంకనే చెరువులు బాగు పడ్డాయని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ర్టంలో 24 గంటల కరెంట్ వచ్చిందన్నారు. ఎర్రటి ఎండల్లోనూ నర్మాల చెరువు మత్తడి దుంకిందని గుర్తు చేశారు. త్వరలోనే రెండో విడత గొర్రెల పెంపకం చేపడుతామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ ఏర్పాటు చేశామన్నారు. రైతుబంధు స్ఫూర్తితో కేంద్రం పీఎం కిసాన్ అమలు చేస్తోందన్నారు. ఊరంతా మొక్కలు నాటి పెంచాలి. ప్రతి ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు కనీసం ఒక మొక్క నాటి పెంచాలని సూచించారు.
#PallePragathi #TelanganaRationCards #FSCCards #RationCardStatus #FSCSearch