రాశి ఫలాలు 04-08-21

రాశి ఫలాలు 04-08-21
Spread the love

రాశి ఫలాలు

🐐 మేషం
ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర దర్శనం శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు
మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు
మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు
సుఖసౌఖ్యాలు ఉన్నాయి. మీ మీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఉత్సాహంగా ఉంటారు. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్నిమధుర క్షణాలను గడుపుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు
చేపట్టే పనుల్లో ఆపదలు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. అయినవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు
చేపట్టిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి ఆంజనేయ ఆరాధన చేయాలి.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధు,మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని ఇస్తుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు
మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. వినాయకుని ఆరాధన మేలు చేస్తుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు
ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శని ధ్యానం శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు
మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *