అన్ని కులాల్లో ఉన్న పేదలకు 10 లక్షలు?
ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామంలో కుల సంఘాల సమావేశం కు హాజరైన ఈటల రాజేందర్.
బీజేపీ లోంచేరిన పలువురు గ్రామస్థులు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..
నేను రాజీనామా చేసిన తరువాత అన్నీ వస్తున్నాయి.
ఇన్ని సంవత్సరాలుగా దళితుల బ్రతుకులు కెసిఆర్ కి తెల్వదా?
ఇన్ని రోజులు ఎం చేశారు.
8 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన హామీలు గుర్తు రాలేదా?
ఈ రోజు కూడా దళితుల మీద ప్రేమతో కాదు ఓట్లకోసం జమ్మికుంట వచ్చాడు కెసిఆర్.
ఈటెల రాజేందర్ ను కోల్పోతే పేదవాళ్ళు కోసం అడిగే దిక్కు ఉండడు.
ఎన్నికలు అయిపోతే దేకవు కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే దళిత బంధు ఇవ్వలేని డిమాండ్ చేస్తున్న.
కులం ఏదయినా కన్నీళ్లు అందరికీ ఒకటే .. అందుకే అన్ని కులాల్లో ఉన్న పేదలకు 10 లక్షలు ఇవ్వాలి.
నిజంగా మమకారం ఉంటే అదరికే ఇవ్వు.
సీఎం మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడప దాటవు.
నేను ధర్మాన్ని, కష్టాన్ని, ప్రజలను నమ్ముకున్న.
ఈటెలరాజేందర్ గెలిస్తే ఏమి వస్తాయి అంటున్నారు. రాజీనామా చేస్తేనే ఇన్ని వస్తున్నాయి. గెలిస్తే గొప్ప మార్పు వస్తది.
మీరు గర్వించే పద్దతిలో పని చేస్తా..