ఆసరా పెన్షన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.
తెలంగాణాలో ఆగష్టు 31 లోపు అప్లై చేసుకున్నవారికి ఆసరా పెన్షన్ మంజూరు చేస్తుంది ప్రభుత్వం. అయితే 57 ఏళ్ళు నిండినవారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మీసేవలో అప్లికేషన్ ఫారం తో పాటుగా ఆధార్ xerox ఇచ్చి అప్లై చేయవచ్చు.
ఆసరా పెన్షన్ అప్లై చేసిన తర్వాత ఎలా స్టేటస్ చెక్ చేయాలి అని అందరు సందేహిస్తుంటారు. అయితే మనకు 2 విధాలుగా ఆసరా పెన్షన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
మొదటి విధానం: మీసేవలో మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రెసెప్ప్ట్ ద్వారా మీసేవ వెబ్సైటు లో చెక్ చేసుకోవచ్చు.
రెండవ విధానం: ఆసరా వెబ్సైటు లో మన డీటెయిల్స్ తో చెక్ చేసుకోవచ్చు.
మీసేవ వెబ్సైటు లో మనకు ఇచ్చిన రెసెప్ప్ట్ లో ఉన్న అప్లికేషన్ నెంబర్ ను ఎంటర్ చేసి చెక్ చేయవచ్చు.
2nd Method:
ఆసరా వెబ్సైటు లో వెళ్లి క్విక్ సెర్చ్ లో కి వెళ్లి “Search Pensioner Details” మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ ద్వారా చెక్ చేయవచ్చు.
Search Pensioner Details లోకి వెళ్లిన తర్వాత మన Pension ID / UID / SADAREM ID ఎంటర్ చేయడం ద్వారా చెక్ చేయవచ్చు.
Aasara Website Link:
https://www.aasara.telangana.gov.in/SSPTG/UserInterface/Portal/GeneralSearch.aspx
మీకు ఏమైనా సందేహాలుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలుపగలను.