మూడు మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ‌

మూడు మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ‌
Spread the love

మూడు మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ‌

రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని కొత్త‌పేట‌(ఎల్బీన‌గ‌ర్‌), ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్(స‌న‌త్ న‌గ‌ర్‌),

అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమి పూజ‌.

సీఎం గారి నాయకత్వంలో వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది.

వైద్యారోగ్య రంగంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలుపుతాం

బహిరంగ సభలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు


ఆర్థిక మంత్రి హరీశ్ రావు కామెంట్స్

వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఇది చారిత్రాత్మక ఘట్టం. దేశానికి స్వత్రంత్రం వచ్చి 75 ఏళ్లయినా, గత పాలకులు హైదరాబాద్ వైద్య అవసరాలను గుర్తించలేదు.

బ్రిటిష్ పాలనలో సైన్యం అవసరాలం కసం 200 ఏళ్ల కిందట గాంధీ ఆసుపత్రి, వందేళ్ల కింద కట్టిన ఉస్మానియా, ఎం.ఎన్. జే ఆసుపత్రి తప్ప, కొత్తది కట్టలేదు.

జనాలు పెరిగారు, కొత్త రోగాలు పెరిగాయి. కాని ఈ జనాభాకు అనుగుణంగా కొత్త ఆసుపత్రులను కట్టలేదు. సమైక్య పాలనలో కొత్త కార్పోరేట్ ఆసుపత్రులు మాత్రమే పుట్టగొడుగులా పుట్టాయి.

ఇవాళ గౌరవ సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నలుదిక్కులా నాలుగు ఆసుపత్రులు రావాలని ఆలోచించారు. ఇవాళ ఎల్బీనగర్, ఎర్రగడ్డ, అల్వాల్ లో మూడు ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. అల్వాల్ లో ఇంత మంచి స్థలం ఉందని ఎవరూ చెప్పలేదు. సీఎం కేసీఆర్ గారే బాగా ఆలోచించి ఈ ఆసుపత్రులకు శంకుస్తాపన చేశారు.

కాంగ్రెస్ నేతలు, ఆంధ్రా పాలకులు ఉంటే ఎక్కడ ఏం దొరుకుతుందని చూసేవారు తప్ప. భవిష్యత్తు అవసరాల కోసం ఆలోచించేవారు కాదు. ప్రజల సోయి ఉండేది కాదు. అధికారులు, కాంట్రాక్టర్లు చెబితేనే పని చేసే వారు.

కరోనా పరిస్థితులు క్యాన్సర్, గుండె, కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయి. పేదలు కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఇది ఆలోచించి సీఎం గారు ఈ ఒక్క రోజు కొత్తగా ఆరు వేల సూపర్ స్పెషాల్టీ పడకలు, వరంగ ల్ లో హెల్త్ సిటీ లో మరో 1500 పడకల.. ఇలా 7500 పడకలు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. 3 వేల పడకలు ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి.

ప్రయివేటులో ఐసీయూ కి వెళ్లే రోజుకు 50 వేల నుండి లక్ష రూపాయలు బిల్లు వేస్తారు. ఇది హైదరాబాద్ జంట నగరాల ప్రజలతో పాటు, చుట్టూ ఉండే ఇతర జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుంది.

ఆరోగ్య వై ద్య రంగలో మనం దేశానికే ఆదర్శంగా ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో ఎంత కొట్లాడినా ఆంద్రాకు తప్ప, తెలంగాణలో మెడికల్ కాలేజీలు పెట్టలేదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి తెలంగాణకు 3 కాలేజీలు మాత్రమే వచ్చినవి. సీఎం గారు పేదలకు వైద్యం, విద్య అందాలని దేశానికే ఆదర్శంగా జిల్లాకు ఒకటి చొప్పున 33 మెడికల్ కాలేజీలు పెట్టారు.

గతంలో చెప్పేవారు బెంగాల్ ఏం చేస్తదో రేపు దేశమంతా చేస్తుందని, కాని ఇవాళ

తెలంగాణ ఏం చేస్తుందో రేపు దేశమంతా చేస్తుందన్న నానుడి ప్రారంభమైంది. రైతు బందు,కళ్యాణ ల క్ష్మి, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినా మిషన్ భగీథ ద్వారా ఇంటింటికి తాగు నీరు ఇచ్చినా దేశమంతా అదే మోడల్ నడుస్తోంది. ఇవాళ కేసీఆర్ గారు జిల్లాకు ఓ మెడికల్ కాలేజి అంటే ప్రధాని కూడా అదే కాపీ కొట్టి జిల్లాకు ఓ మెడికల్ కాలేజి పెడతామంటున్నారు.

రాష్ట్రం ఏర్పడిన నాడు ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇవాళ తెలంగాణ లో 17 మెడికల్ కాలేజీలకు చేరుకుంది. రానున్న రెండేళ్లలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి.

నర్సింగ్ కాలేజీలు 6 మాత్రమే రాష్ట్రం ఏర్పడిన నాడు ఉండేవి. ఏ నర్సింగ్ కాలేజీలకు వెళ్లినా కేరళ స్ఠాఫ్ నర్సులు ఉండే వారు. కాని కాలేజీలు పెట్టలేదు. జిల్లాకో నర్సింగ్ కాలేజీలు పెట్టాలని, 33 జిల్లా కాలేజీలు పెట్టాలని నిర్ణయించారు. గద్వాల, బాన్సువాడ లో ఇప్పటికే ప్రారంభమైంది.

హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు సూపర్ హిట్ అయింది. 15వ ఆర్థిక సంఘం బస్తీదవాఖానాలు పేదలకు మంచి వైద్య సేవలు అందిస్తోందని దేశమంతా పెట్టాలని కొనియాడింది. ఇది బస్తీల్లో దవాఖానల సుస్తిని పొగొట్టాలని సీఎం కేసీఆర్ గారే ఆలోచించి హైదరాబాద్ లో ప్రజల అవసరాలకు అనుగుణంగా 350 బస్తీ దవాఖానాలు పెట్టించారు.

సగటున రోజు 30-35 వేల ప్రజలకు ఉచిత వైద్యం, పరీక్షలు, మందులు ఇస్తున్నారు. ఇదే స్పూర్తితో పల్లె దవాఖానాలు ప్రారంభించాలని సూచించారు. కేసీఆర్ కిట్. మరో అద్భుతమైన పథకం.

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనేవారు. కేసీఆర్ కిట్ పథకం తెచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం 30 నుంచి 54 శాతానికి పెరిగింది. ఇవాళ మోర్టాలిటీ రేటు బాగా తగ్గిపోయి దేశంలో తమిళనాడును బై పాస్ చేసి 3వ స్థానంలోకి వెళ్లింది. వైద్య ఆరోగ్య రంగంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండేది . కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని వెనక్కు నెట్టి ముందుకు వెళ్లింది. మాతా శిశు మరణాల్లో ఆ రాష్ట్రాన్ని వెనక్కు నెట్టి ముందుకు వెళ్లాం.

తెలంగాణ కు ముందు హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు ఉండేవి. 75 ఏళ్లలో తెలంగాణలో కేవలం మూడు మాత్రమే ఉండేవి. రాష్ట్రంలో 30 వేల కిడ్నీ రోగులు ఉండేవారు. వారి బాధ వర్ణనాతీతం. దాన్ని కేసీఆర్ గారు 102 కు పెంచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సింగల్ యూజ్ ఫిల్టర్ మెథడ్ ద్వారా డయాలిసిస్ సేవలు అందిస్తున్నం.

కాంగ్రెస్ వాళ్ల మాటలు కోటలు దాటుతాయి. ఐసీయుల కోసం చెప్పాలంటే
ఐసీయుల సంఖ్య 2014 లో కేవలం ఐదు మాత్రమే ఉండేవి. ఏడేళ్లలో 80 ఐసీయులు ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతమైన వైద్యాన్ని కేసీఆర్ గారి పాలనలో అందుబాటులోకి వచ్చింది.

టీ డయగ్నాసిస్ సర్వీసు లద్వారా ఒక్క రూపాయి ఖ ర్చు లేకుండా 57 పరీక్షలు చేసి వారి సె ల్ ఫోన్ కే సమాచారం అందిస్తున్నం. అమ్మ ఒడి వాహనాలు, పరమ పద వాహనాలు, అలన వాహనాలు అందుబాటులోకి తెచ్చాం. పుట్టినప్పడి నుండి చావు వరకు అవసరమైన అంతిమ యాత్ర వరకు ప్రభుత్వం సేవలు అందిస్తోంది.

గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు కేవలం హైదరాబాద్ లో మాత్రమే జరిగేవి. కాని ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ లో క్యాథ్ లాబ్ లు పెట్టి గుండె శస్త్ర చికిత్సలు జరుపుతున్నారు. మార్చురీల ఆధునీకరణ జరుగతోంది.

రాష్ట్రంలో 27 వేల పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. ఎస్. ఎన్. సీయులు, డీపీసీయులు పెంచుకున్నం. తెలంగాణ వచ్చిన నాడు మాతా శిశు ఆసుపత్రులు 6 ఉండే నేడు 28కు పెంచుకున్నం. వైరాలజీ ల్యాబ్ లు ఆనాడు 1 మాత్రమే ఉండే నేడు 33 జిల్లాల్లో ఏర్పాటు చేసుకున్నం. బ్లడ్ బ్యాంకులు 18 ఉంటే ఇవాళ 31 కుపెంచుకున్నం.

ఆక్సిజన్ సౌకర్యం కరోనా టైం లో చాలా ఇబ్బంది పడ్డం. సీఎంగారి నిర్ణయం మేరకు రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్ ఉత్పత్తి ఇక్కడే ప్రారంభించుకుంటున్నం. ఇందుకు 500మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా ఇబ్బంది లేకుండా ఉత్పత్తి జరుగుతోంది. ఆక్సిజన్ బెడ్స్ తెలంగాణలో 1400 మాత్రమే ఉండేది. 27 వేల990 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేయించారు సీఎం గారు.

ఈ నాలుగు ఆసుపత్రులు వచ్చాక రాబోయే రోజుల్లో పేదలు ఒక్క రూపాయి అవసరం లేకుండా వైద్య సేవలు పొందుతారు.

పేదలు జిల్లాల నుంచి వస్తే ఫుట్ పాత్ లమీద పడుకుంటున్న, భోజనానికి ఇబ్బంది పడుతున్నారని సీఎం గారు వారికి షెల్టర్లు, మూడు పూటల భోజనం పె ట్టమని ఆదేశంచారు. హైదరాబాద్ లోని 18 ఆసుపత్రుల్లో షెల్టర్ హోమ్స్ కడుతున్నం. రాబోయే కొద్ది రోజుల్లో మూడు పూటలా భోజనం పెట్టనున్నాం.

కేంద్రం పార్లమెంట్ లో చెప్పారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య రంగంలో మూడో స్థానంలో ఉందని చెప్పారు. డబులు ఇంజన్ ప్రభుత్వం, డబులు ఇంజన్ గ్రోత్ అని బీజేపీ వాళ్లు గొప్పగా చెబుతున్నారు. యూపీలో డబులు ఇంజన్ ప్రభుత్వం ఉన్న యూపీ ఆరోగ్య రంగంలో డబులు ఇంజన్ గ్రోత్ ఏం సాధించిందంటే చిట్టచివరి స్థానంలో ఉంది. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తోన్న రాష్ట్రంలో యూపీ ఆరోగ్య సేవలు అందించడం లో చిట్టచివరి స్థానం ఉంది.

వైద్య ఆరోగ్య రంగంలో దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపారు. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో మూడో స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణను తొలి స్థానంలో నిలుపుతామని సీఎంగారికి సవినయంగా విన్నవిస్తున్నా..

ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు హ‌రీశ్‌రావు, మ‌హ‌ముద్ అలీ, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, సుధీర్ రెడ్డి, మైనంప‌ల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ‌, కాలేరు వెంక‌టేశ్‌, సాయ‌న్న‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, టీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *