సీఎం సీటును ఎడమ కాలి చెప్పుతో సమానమన్న కేసీఆర్ ?
• తెలంగాణలో బీజేపీకి లభిస్తున్న ప్రజా స్పందన చూశాక కేసీఆర్ కేంద్రాన్ని, బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. గుణాత్మక మార్పు పేరుతో దేశమంతా తిరుగుతున్నారు. 8 ఏళ్లలో ఏనాడూ సెక్రటేరియెట్ కు రాకపోవడమే గుణాత్మక మార్పా? 5 ఏళ్లపాటు కేబినెట్ లో మహిళకు చోటు కల్పించకపోవడమే గుణాత్మక మార్పా? 4 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడమే గుణాత్మక మార్పా?
• సీఎం సీటును ఎడమ కాలి చెప్పుతో సమానమన్న కేసీఆర్… అదే సీఎం సీటును కొడుకు అప్పగించాలనే పుత్ర వాత్సల్యంతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పనైపోయిందని తెలిసి నిరాశ, నిస్ర్పహ, అసహనానికి లోనవుతున్నరు.
• పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాల ఆర్దిక వ్యవస్థ కరోనావల్ల అతలాకుతలమైతే.. భారత ఆర్దిక వ్యవస్థ పురోగమిస్తోంది. మన దేశ ఆర్ధిక, విదేశీ విధానాలను కొనియాడుతుంటే కేసీఆర్ మాత్రం విమర్శిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కేసీఆర్ లాంటి నేతలను బీజేపీ ఎంతో మందిని చూసింది. ఎన్నో పోరాటాల చేయడంవల్లే ఈరోజు 18 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది.
• కేసీఆర్ పాలనను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి కేసీఆర్ బీజేపీపై విషం చిమ్ముతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి సాయం చేస్తున్న కేసీఆర్… తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు చనిపోతే ఎందుకు సాయం చేయలేదు? తెలంగాణ కోసం ఎంతోమంది చనిపోతే ఆ కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదు? నిరుద్యోగ భ్రుతి, రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదు?
• కేంద్రం ఏమీ చేయడం లేదని విమర్శిస్తున్న కేసీఆర్… సైన్స్ సిటీ కోసం 25 ఎకరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదు? యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగిస్తామని ప్రతిపాదిస్తే, తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెబితే..కొత్తగూడెం-భద్రాచలం వరకు రైల్వే లేన్ వేస్తామని చెబితే ఎందుకు స్పందించలేదు?
• రాష్ట్రంలోని అన్ని వర్గాలు కేసీఆర్ పాలన అంతం కావాలని కోరుతున్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ తెరమరుగైంది. నాయకత్వలేమితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో కుటుంబ, వారసత్వ పాలనను కూకటి వేళ్లతో పెకలించే వేసే సత్తా బీజేపీకే ఉంది.
• కేసీఆర్ సహా దేశవ్యాప్తంగా మరో వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా బీజేపీని ఏమీ చేయలేరు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే. ఈసారి అత్యధిక సీట్లతో అధికారంలోకి వస్తాం.