అమలాపురంలో అల్లర్లు దాడుల వెనక కుట్రకోణం

అమలాపురంలో అల్లర్లు దాడుల వెనక కుట్రకోణం
Spread the love

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్‌:

అమలాపురంలో అల్లర్లు దాడుల వెనక కుట్రకోణం
అందుకు కొందరు నేతల ప్రవర్తనే ప్రత్యక్ష సాక్ష్యం
ప్రతిపక్షాల స్పందన చూస్తే వారే కధ నడిపించారనిపిస్తుంది
ఆ అనుమానాలే మరింతగా బలపడుతున్నాయి
వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల వెల్లడి

టీడీపీ, జనసేన రెండూ వైయస్సార్‌సీపీపై ఆరోపణలు
మా మంత్రి, మా ఎమ్మెల్యే ఇళ్లపై మేమే దాడులు చేస్తామా?
విపక్షాల అడ్డగోలు విమర్శలకు అసలు అర్థం ఉందా?
అర్ధం లేని ఆరోపణలపై వారి విచక్షణకే వదిలేస్తున్నాం
పవన్‌కళ్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు
టీడీపీ ఆఫీస్‌ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ చదువుతున్నాడు
శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడంపై మీ వైఖరి ఏమిటి?
టీడీపీ, జనసేనను సూటిగా ప్రశ్నించిన శ్రీ సజ్జల
పేరు మార్పు ఇష్టం లేకపోతే స్పష్టంగా చెప్పాలి
కానీ మీరే గతంలో ఆ డిమాండ్‌ చేశారు
ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి:

ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

వారి ప్రవర్తనే సాక్ష్యం:
నిన్న అమలాపురంలో జరిగిన ఘటనలపై కొన్ని రాజకీయ పక్షాలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే, ఎవరైతే వ్యూహాత్మకంగా ఒక పథకం ప్రకారం ఎవరైతే కధ నడిపించారో వాళ్లే ఇలా స్పందిస్తున్నారన్న అనుమానాలు బలపడడంతో పాటు, దానికి వారి ప్రవర్తన ఒక సాక్ష్యంగా నిలుస్తోంది. నిన్న నేను మీడియాతో మాట్లాడే సమయానికి మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి జరిగినట్లు నాకు తెలియదు. దానిపై మీడియా మిత్రులు అడిగితే, అది హఠాత్తుగా జరిగే అవకాశం లేదని అన్నాను. ఆ తర్వాత జరుగుతున్నవి చూస్తుంటే, వస్తున్న స్పందనలు చూస్తుంటే, ఆ అనుమానాలు నిజమనిపిస్తోంది.

మాపై అర్ధంలేని ఆరోపణలు:
జిల్లాల పునర్విభజన తర్వాత 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ఆ తర్వాత ఇదంతా. ఈనెల 18న, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత దాని పర్యవసానం మాదిరిగా నిన్నటి సంఘటన ప్లాన్‌ చేసినట్లు కనిపిస్తోంది. కలెక్టరేట్‌ ముట్టడి, బస్సులు తగలబెట్టడం, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లపై దాడి. ఆ తర్వాత తగలబెట్టడం.
వీటి మీద స్పందించిన చంద్రబాబు కానీ, అచ్చెన్నాయుడు కానీ, ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌ కానీ అందరూ ఇదంతా వైయస్సార్‌సీపీ వారే చేశారని ఆరోపించారు.

కనీస పరిజ్ఞానం ఉందా?:
కానీ వాస్తవాలు గుర్తించండి. మేము సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నాం. ఒకవేళ దాడికి కొన్ని నిమిషాల ముందు మంత్రి కుటుంబ సభ్యులను బయటకు తరలించకపోయి ఉంటే, వారు కూడా సజీవ దహనం అయి ఉండే వారు కాదా? జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టింది మా ప్రభుత్వం. అలాంటప్పుడు మా మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ల మీద, అది కూడా వారి కుటుంబ సభ్యులు ఇళ్లలో ఉన్నప్పుడు ఇలా దాడి చేస్తారా? అది మా ఇంటి మీద మేమే చేసుకోవడం కాదా?
కనీస పరిజ్ఞానం ఉన్న వారు దీన్ని అంగీకరిస్తారా. ఆరోపణలకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు చేయడం సబబా? మన స్థాయికి తగినట్లుగా అవి ఉంటాయా? అన్నది వారే ఆలోచించుకోవాలి.

చంద్రబాబు. ఆర్కెస్ట్రా:
ఎందుకంటే వాళ్లంతా ఒక కోరస్‌. చంద్రబాబు లీడర్‌. ఆయన లేదా ఆ పార్టీ నాయకులు మాట్లాడతారు. ఆ వెంటనే పవన్‌కళ్యాణ్‌ అందుకుంటారు. ఆ తర్వాత బీజేపీ వారూ మాట్లాడతారు. ఇదంతా ఒక కోరస్, ఆర్కెస్ట్రా మాదిరిగా సాగుతోంది.
ఇవన్నీ టీడీపీ అధికార మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఛానళ్లలో పదే పదే ప్రచారం చేసి, ప్రజల్లో ఒక అభిప్రాయం కలిగించే ప్రయత్నం, ఆరోపణల పర్వం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. అంత మంది అంటున్నారు కాబట్టి, అందులో నిజం ఉందని అందరూ అనుకోవాలని వారు సమన్వయంతో చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇంత దుర్మార్గమా?:
దాడులకు ప్లాన్‌ చేసింది. చేయించింది. దాన్ని తిరిగి వైయస్సార్‌సీపీ మీదే వేయడం.. ఇంత కంటే రాజకీయ నైత్యం కానీ, దుర్మార్గం కానీ వేరే ఇంకేమైనా ఉంటుందా? మా ముఖం మేము కొట్టుకుంటామా? మా మంత్రి, మా ఎమ్మెల్యే ఇళ్ల మీద దాడి చేసి మేము ఏం సాధిస్తాం? పోనీ అంబేడ్కర్‌ పేరు వేరెవరైనా పెడితే మేము తీసేశామా? లేక ఎవరూ వద్దంటే మేమే ఆ పేరు పెట్టామా?
అయితే మొత్తం మీద ఒకటి అంగీకరిస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పక్కా ప్రణాళికతో, ముందస్తు వ్యూహంతో చేసిందని అంటున్నారు. అయితే అది చేసింది ఎవరనేది మేము చెబుతున్నాం. అది చేసింది మీరే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న మేము వైఫల్యం చెందామని ఎందుకు అనిపించుకుంటాం. ఆ అవసరం మాకేముంది?
అమలాపురంలో ఆ గొడవలు మీరు చేశారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు చెబుతున్నాడు. సాయి అనే వ్యక్తి నాతో ఫోటో దిగాడని. ఔను నాకు గుర్తుంది. అతడు నా కారు దగ్గరకు వచ్చి ఒక సెల్ఫీ తీసుకున్నాడు. అదే వ్యక్తి వారందరితో ఇళ్లలో ఫోటోలు తీసుకున్నాడు.

ఆ మాట ఎందుకంటే?:
అమలాపురం దాడుల వెనక కచ్చితంగా వారే ఉన్నారని ఎందుకంటున్నామంటే.. అసలు మీ అభ్యంతరం దేని మీద? దాడి అన్యాయమనుకుంటున్నారా? అయితే ఖండిచండి. లేక జిల్లాకు అంబేడ్కర్‌ పేరు వద్దంటున్నారా? అయితే అదే విషయం చెప్పండి.
కానీ అవేవీ చేయకుండా, జరిగిన ఘటనలను అటూ ఇటూ తిప్పి వైయస్సార్‌సీపీ ప్రభుత్వానికి అంట కట్డడం ద్వారా ఏదైనా మీ సంకుచిత లక్ష్యం సాధించాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇవన్నీ మీ ఆరోపణల్లో కనిపిస్తున్నాయి. అందుకే మీ మీద మాకు అనుమానాలున్నాయి. అందుకు సాక్ష్యాలు ఇవీ అని చెప్పాల్సి వస్తోంది.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: