00 పడకల ఆసుపత్రి పేదలకు వరం
ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి బాల్కొండ నియోజకవర్గ ప్రజలంటే అత్యంత ప్రేమ
చెక్ డ్యాంలు,లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు,రోడ్లు,మున్సిపాలిటీ,100 పడకల ఆసుపత్రి ఇలా ఏది అడిగిన కాదనకుండా ఇచ్చారు
వారికి నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక దన్యవాదాలు
భీంగల్ లో 100 పడకల ఆసుపత్రి మంజూరీ పై ప్రత్యేక శ్రద్ద కనబర్చిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు
నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తున్న ఎమ్మెల్సి కవితమ్మకు కృతజ్ఞతలు
వారంలో హాస్పిటల్ భవన నిర్మాణానికి భూమిపూజ
- కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి👆🏻
భీంగల్:
ఇన్నాళ్లు నిరుపేద ప్రజానీకానికి ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేదని కానీ సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా వందల కోట్లు వెచ్చించి అత్యాధునిక ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకు వస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం కేసిఆర్ చిత్రపటానికి మంత్రి వేముల పాలాభిషేకం నిర్వహించారు.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వంద పడకల ఆసుపత్రి తన హయాంలో మంజూరు కావడం సంతోషంగా ఉందని చెప్పారు.ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి బాల్కొండ నియోజకవర్గ ప్రజలంటే అత్యంత ప్రేమని చెప్పారు.ఉద్యమ సమయం నుంచి రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి కేసిఆర్ కు సన్నిహితంగా ఉండడంతోఈ ప్రాంత కష్ట నష్టాలు వారికి బాగా తెలుసన్నారు..అందుకే చెక్ డ్యాంలు,లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు,రోడ్లు,మున్సిపాలిటీ,100 పడకల ఆసుపత్రి ఇలా ఏది అడిగిన కాదనకుండా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.కేసిఆర్ కు రుణపడి ఉంటానని తెలిపారు.నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. భీంగల్ లో 100 పడకల ఆసుపత్రి మంజూరీ పై ప్రత్యేక శ్రద్ద కనబర్చిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తున్న ఎమ్మెల్సి కవితమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.వీలైనంత తొందరగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆతృత ఉందన్నారు. వారం పది రోజుల్లో ఆరోగ్య శాఖ మంత్రి తో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ కార్య క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు