తెలంగాణలోని మరో మూడు పట్టణాలకు అవార్డులు
ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ ఎల్) అవార్డును దక్కించుకున్న పట్టణాలు
ఫిర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పట్టణాలకు అవార్డులు
మొత్తంగా మొన్నటి 16 స్వచ్ఛ సర్వెక్షన్ అవార్డులతో కలిపి మొత్తంగా 19 పట్టణాలకు అవార్డులు
మూడు పురపాలికలకు మంత్రి కే తారక రామారావు అభినందనలు
హైదరాబాద్ : తెలంగాణ పట్టణ ప్రగతి ఫలితానిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని మరో మూడు పట్టణాలకు అవార్డులు దక్కాయి. మున్సిపల్ శాఖ చేపట్టిన కార్యక్రమాలు అవార్డుల పంట పండిస్తున్నాయి. తాజాగా మూడు అవార్డులతో కలిపి మొత్తం 19 అవార్డులు దక్కాయి. ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ ఎల్) పోటీల్లో భాగంగా తెలంగాణలోని మూడు పట్టణాలు ఫిర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పట్టణాలు అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా సీడీఎంఏ ఎన్.సత్యనారాయణకు సమాచారం అందించారు. ఈ నెల 17న నిర్వహించిన ఇండియన్ స్వచ్ఛత లీగ్ పోటీని నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న పట్టణాల్లో వీటిని ఎంపిక చేశారు. దేశంలోని 1850 పట్టణాలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో తెలంగాణలోని మూడు పట్టణాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఇప్పటికే దక్కిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులతో తెలంగాణ పట్టణాలకు 19 అవార్డులు దక్కాయి. 15వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో అలంపూర్ పట్టణ స్థానిక సంస్థ ఎంపికైంది. 25 వేల నుంచి 50వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ , 50వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరిలో కోరుట్ల పట్టణం ఎంపికయ్యాయి. ఈ మూడు పట్టణాలకు ఈనెల 30న ఢిల్లీలో టల్కటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రధానం చేస్తారు.
ఇండియన్ స్వచ్ఛత లీగ్ పోటీల్లో భాగంగా, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు బృందాలను మున్సిపాలిటిలు ఏర్పాటు చేశాయి. కెప్టెన్లను నియమించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్లాగ్ రన్, పరిశుభ్రంగా మార్చిన ప్రదేశాలు, చారిత్రక, జియోగ్రాఫికల్ ప్రదేశాలు, ర్యాలీలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని అంచనా వేయడంలో భాగంగా ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారు, ఎన్ని ఈవెంట్లు నిర్వహించారు, ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా జరిగిన కార్యక్రమాలు ద్వారా అసెస్మెంట్ చేశారు. అవార్డులు పొందిన మూడు పట్టణ స్థానిక సంస్థలు ఫిర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్. 15వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో అలంపూర్ పట్టణ స్థానిక సంస్థ ఎంపికైంది. 25 వేల నుంచి 50వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ , 50వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరిలో కోరుట్ల పట్టణం ఎంపికయ్యాయి.
ఇండియన్ స్వచ్ఛత లీగ్ లో తాజాగా అవార్డు పొందిన పిజ్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పురపాలికలకు మంత్రి కే తారకరామారావు అభినందనలు తెలిపారు.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.