బీఆర్​ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కెసిఆర్

బీఆర్​ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కెసిఆర్
Spread the love

బీఆర్‌ఎస్‌ ప్రకటన తర్వాత కేసీఆర్ యూపీ టు ఢిల్లీ పర్యటన

హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిసారి ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ వారంతం వరకు కేసీఆర్‌ ఢిల్లీ లోనే ఉంటారని తెలుస్తోంది. పలు పార్టీలతో జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని సమాచారం. ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకోసం జోద్‌పూర్‌ వంశీయుల బంగ్లాను కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు.అంతకుముందు సీఎం కేసీఆర్ ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లారు. స్వర్గస్తులైన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయకు వెళ్లిన సీఎం ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోశ్‌​ కుమార్, ఎమ్మెల్సీ కవిత, తెరాస నేత శ్రవణ్​కుమార్ ములాయం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ములాయం సింగ్ యాదవ్​ అంత్యక్రియల అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: