ఈ రోజు నుంచే లక్ష డబుల్ బెడ్ రూమ్ పంపిణీ మొదలు!
ఈ రోజు నుంచే లక్ష డబుల్ బెడ్ రూమ్ పంపిణీ మొదలు!
పేదప్రజల కోసమే తొలి సంతకంహైదరాబాద్ నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై నూతన సచివాలయంలో తొలి సంతకం చేయనున్న మంత్రి కేటీఆర్- రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి రేపు మంత్రి కేటీఆర్ అడుగుపెట్టబోతున్నారు- నూతన సచివాలయం మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్ ఇకనుంచి తన విధులను నిర్వర్తించనున్నారు- చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ రేపు అత్యంత కీలకమైన ఫైలుపైన మొదటి సంతకం చేయనున్నారు- హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపైన మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు.