2వ విడత ఇళ్ల పంపిణి కోసం కావాల్సిన డాకుమెంట్స్. #KCRDoublebedroom #kcrdoublebedroomhyderabad #telanganadoublebedroom
#kcrdoublebedroomhyderabad #telanganadoublebedroom #kcrDoublebedroom
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 21న రెండో విడుత డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ శుక్రవారం సమీక్ష సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహబూద్ అలీ, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న హైదరాబాద్ రెండో దశలో దాదాపు 13,300 ఇండ్లను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అత్యంత పారదర్శకంగా పేదలకు మాత్రమే అందిస్తున్నామని, డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంపికలో ఎవరి ప్రమేయం లేదన్నారు. లబ్ధిదారులను ఎంపికను ప్రభుత్వ అధికారులకే అప్పగించామని, లబ్ధిదారుల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నామన్నారు. త్వరలో హైదరాబాద్‌లో గృహలక్ష్మి పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పథకంలో భాగంగా ఇండ్ల స్థలాలు ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్.
అయితే 2వ విడత కు ఎంపిక అయినా వారి దగ్గర ఉండాల్సిన డాకుమెంట్స్ ను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మొదటి దశలో ప్రభుత్వం తీసుకున్న డాకుమెంట్స్ ఇవి. అందుకే 2వ దశలో కూడా వీటిని ప్రభుత్వం అడుగుతుంది కాబట్టి. వాటిని మీకు తెలియచేసున్నమ్.
ఇది చాల మంచి ఇన్ఫర్మేషన్ కాబ్బట్టి దయచేసి మీ సోషల్ మీడియా లో ఈ లింక్ ను షేర్ చేసి అందరికి హెల్ప్ చేయండి.
1) రేషన్ కార్డు xerox
2) అందరి ఆధార్ కార్డు xerox
3) ఓటర్ ఐడి కార్డు xerox
4) పాస్ పోర్ట్ ఫొటోస్ (8 తీసుకోండి కొత్తవి)
5) బ్యాంకు పాస్ బుక్
6) కాస్ట్ సర్టిఫికెట్ (కుల ధ్రువీకరణ పత్రం) SC / ST అయితే
7) వికలాంగుల సర్టిఫికెట్ (ఒకవేళ అయితే)
ఇవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇవి మాత్రమే కచ్చితంగా అడుగుతారు అని కంఫర్మ్ చేయటం లేదు. వారికీ వేరేవి కావాల్సి వస్తే అడుగుతారు. ముందు జాగ్రత్త మీకు చెప్పటం కోసం మాత్రమే.