మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి మొదలు. సీఎం ఆదేశం!
అర్హులైన వారికి మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ గృహాలను పంపిణి చేయండి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబుల్ బెడ్‌రూమ్ పథకంపై కీలక ప్రకటన చేశారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు మిగిలిన గృహాలను తక్షణం పంపిణి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రధానంగా ఏమన్నారు?
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన ఈ డబుల్ బెడ్‌రూమ్ పథకం పేదల జీవితాల్లో సుస్థిరతను తీసుకురావడానికి ఒక గొప్ప పథకమని మొదలు పెట్టారు దీనిలో భాగంగా ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు గృహాలను పొందారు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇళ్లు పూర్తి కావడం లేదా పంపిణీ జరగకపోవడం వల్ల అర్హులు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
గృహాల పంపిణీ ప్రక్రియ:
ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను అనుసరించి గృహాలను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను నిర్ధారించి, ఇప్పటి వరకు మంజూరు చేయని గృహాలను త్వరగా పంపిణి చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం కృషి:
ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించి, వీలైనంత త్వరగా మిగిలిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే క్రమంలో తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.