పుష్ప 2 – పవన్ కళ్యాణ్ కు స్పెషల్ థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్
పుష్ప 2: ది రూల్ టిక్కెట్ ధరల పెంపు గురించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎం చేస్తుందో అని అందరూ ఎదురు చూసారు. అల్లు అర్జున్ అభిమానులు టిక్కెట్ ధరలు పెంచడానికి మరియు అదనపు షోలు అనుమతించడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయంపై ఆధారపడిన సమయంలో మరింత ఆసక్తిని కలిగించింది.
పుష్ప 2 ది రూల్ చిత్రం డిసెంబర్ 5, 2024న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అదనపు షోలు మరియు టిక్కెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై అల్లు అర్జున్ ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తన కృతజ్ఞతలు తెలిపారు.
GO ప్రకారం, డిసెంబర్ 4, 2023న ఉదయం 9:30కి ప్రత్యేక ప్రీమియర్ షోను ప్రదర్శించేందుకు అనుమతిని ఇచ్చారు. ఈ ప్రీమియర్ షోకు టిక్కెట్ ధర రూ. 800 ప్లస్ జీఎస్టీ గా నిర్ణయించారు.
అలాగే, డిసెంబర్ 5, 2024న 6 షోలు ప్రదర్శించేందుకు అనుమతించారు. ఈ రోజుకు టిక్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
లోయర్ క్లాస్ టిక్కెట్‌కు అదనంగా రూ. 100 (జీఎస్టీతో సహా).
అప్‌పర్ క్లాస్ టిక్కెట్‌కు అదనంగా రూ. 150 (జీఎస్టీతో సహా).
మల్టీప్లెక్స్ టిక్కెట్‌లకు రూ. 200 (జీఎస్టీతో సహా).
డిసెంబర్ 6, 2024నుంచి డిసెంబర్ 17, 2024 వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతించారు. ఈ సమయంలో కూడా టిక్కెట్ ధరలు అదే విధంగా ఉంటాయి.
ఈ ప్రభుత్వం ఉత్తర్వు పుష్ప 2: ది రూల్ మేకర్స్‌కి పెద్ద ఊరటగా మారింది. అల్లు అర్జున్ అభిమానులు ఈ నిర్ణయంతో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ప్రీ-సేల్స్‌తో కొత్త రికార్డులు నెలకొల్పుతున్న పుష్ప 2, టిక్కెట్ ధరల పెంపు మరియు అదనపు షోలతో ఎంతటి భారీ కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.