జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై కేటీఆర్‌

Spread the love

పెండింగ్‌లో ఉన్న జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు రాష్ట్ర‌ ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ శ్రీ అల్లం నారాయ‌ణ నేతృత్వంలోని బృందం బుధ‌వారం మంత్రి శ్రీ కేటీఆర్‌తో స‌మావేశ‌మైంది. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, జిల్లా కేంద్రం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్ట్ లకు ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, హైద్రాబాద్ లోని జర్నలిస్ట్ లకు ఇల్లు కల్పించడం, జవహర్ లాల్ నెహ్రు సొసైటీకి పెట్ బషీరాబాద్‌లోని స్థలాన్ని కేటాయించడం, చిన్న పత్రికల గ్రేడింగ్‌తో పాటు అనేక సమస్యలపై మంత్రితో చర్చించారు.కరోనా సమయంలో బాధిత జర్నలిస్ట్ లకు ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున అందజేసిన ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణను మంత్రి కేటీఆర్ అభినందించారు. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు సహాయనిది అందజేసే కార్యక్రమనికి ఈనెల 7వ తేదీన హాజరుకావాలని అల్లం నారాయ‌ణ ఈ సందర్బంగా కోర‌గా అందుకు మంత్రి కేటీఆర్ అంగీక‌రించారు.

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని దేశంలో ఎక్కడా ఏ ప్రెస్ అకాడమీ కూడా పనిచేయని విధంగా తెలంగాణ మీడియా అకాడమీ పనిచేస్తూ ప్రభుత్వ సహకారంతో అనేక రకాలుగా సేవ‌లు అందిస్తున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. మిగిలిన సమస్యలన్నింటీని కూడా కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని ఇళ్ల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కూడా సుముఖంగా ఉన్న‌ట్లు కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ క్రాంతి కిరణ్, శ్రీ బాల్క సుమన్, టీయూడ‌బ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టీఈఎంజేయూ అధ్యక్ష కార్యదర్శులు ఇస్మాయిల్, రమణ, హైద్రాబాద్ యూనిట్ అధ్యక్షుడు యోగనందం, ఫోటో జర్నలిస్ట్ అధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *