నేడు ‘జగనన్న ప్రాణ వాయువు రథచక్రాలు’ ప్రారంభం
కరోనా రోగులకు తక్షణ వైద్య సహాయం నిమిత్తం రెండు ఏసీ బస్సులు
ప్రభుత్వాసుపత్రిలో బెడ్స్ లభించే లోపు బస్ లోనే ఆక్సిజన్ బెడ్స్ సదుపాయం
“ఆక్సిజన్ ఆన్ వీల్స్”ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు_రాజమహేంద్రవరం ఎంపి భరత్ రామ్ సెకండ్ వేవ్ కరోనా ఉదృతి నేపథ్యంలో ఆక్సిజన్ కోసం ప్రభుత్వాసుపత్రి వద్ద నిరీక్షిస్తున్న రోగులకు వైద్య సేవలు నిమిత్తం ‘జగనన్న ప్రాణ వాయువు రథ చక్రాలు’ అనే వినూత్న సదుపాయాన్ని బుధవారం ప్రారంభించనున్నట్టు రాజమహేంద్రవరం ఎంపి, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ తెలిపారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమయానికి తగిన వైద్యం అందక ఎంతో మంది మరణిస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి వరండాల్లోనూ, ఆసుపత్రి ప్రాంగణంలోను, చెట్ల వద్ద ఆక్సిజన్ కోసం ఎంతో టెన్షన్ తో నిరీక్షించేవారికి తాము ఏర్పాటు చేయబోయే బస్సులో ఆక్సిజన్ తదితర వైద్య సేవలను అందించడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్స్ లభించగానే బస్సులో చికిత్స పొందుతున్న వారిని వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసేలా వైద్యులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఎన్జీవోస్ ఆధ్వర్యంలో “ఆక్సిజన్ ఆన్ వీల్స్”నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే రెండు మూడు చోట్ల ట్రయల్ రన్స్ నిర్వహించగా విజయవంతమైనట్టు ఎంపి తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ‘జగనన్న ప్రాణ వాయువు రథ చక్రాలు’ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. మన రాజమహేంద్రవరం బుధవారం నుంచి చేపట్టబోయే జగనన్న ప్రాణ వాయువు రథ చక్రాలు కార్యక్రమం విజయవంతమైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉందని మార్గాని ఎంపి భరత్ రామ్ తెలిపారు.