లాక్డౌన్ మార్గదర్శకాలు.
- వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలకు ఎక్కడా ఆటంకం కలిగించకూడదు
- వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు
- ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగనున్నాయి
- ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు,
- అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.
- విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.
- జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.
- పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.
- కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు.
- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మినహాయింపు ఇచ్చారు.
- ఉపాధి హామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.
- ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
- బ్యాంకులు, ఏటీఎంలు యథావిథిగా పని చేయనున్నాయి
- ముందస్తు అనుమతులతో జరిగే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.
- అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ఉంది.