గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు శ్రీ హరీష్ రావు తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించి , సూపర్ స్ప్రేడర్లు అందరికీ టీకాలు వేసే అంశంపై చర్చించారు.
ఎల్.పి.జి. డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలోని విక్రేతలు, పండ్లు, కూరగాయలు మరియు పూల మార్కెట్లు, కిరాణా షాపులు , మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్ల లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ చేయుటకు ఆదేశించారు. సూపర్ స్ప్రెడర్ల గుర్తింపు మరియు ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.
ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ, జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ శ్రీ యన్.సత్యనారాయణ, రవాణా శాఖ కమిషనర్ శ్రీ యం.ఆర్.యం.రావు, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ లోని ప్రైవేటు ఆసుపత్రులు 18సం దాటిన వారికి, మరియు వర్క్‌ప్లేస్ వ్యాక్సినేషన్ చేసేందుకు అనుమతినిస్తూ… తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు..