ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌
09.09.2020 సౌమ్య వాసరే
రాశి ఫలాలు
🐐 మేషం
శ్రమ ఫలిస్తుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సాయంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఉత్సాహంగా ముందుకు సాగితే సమస్యలు దరిచేరవు. ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. చంద్ర శ్లోకం చదవాలి.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రతీ ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
మంచి కాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలు అందుకుంటారు. మానసిక ఆనందాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
💃💃💃💃💃💃💃
⚖ తుల
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది. ⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్ఛరిత్ర పారాయణ శుభాన్ని కలిగిస్తుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులపాలవుతారు. సుబ్రహ్మణ్య భుగంజ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
చేపట్టే పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మనః పీడ పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందూ, వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవంతు 👌