వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలకు నేడే

వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలకు నేడే
Spread the love

వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలకు నేడే (సోమవారం, 07–09–2020) శ్రీకారం
క్యాంపు కార్యాలయంలో పథకాలను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత బలమైన పౌష్టికాహారం
రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్న బాలింతలు, గర్భిణీ స్త్రీలతో పాటు 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు ఈ పథకాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ
వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం కింద 77 గిరిజన మండలాల్లో 3.80 లక్షల గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు రూ.307.55 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
వైఎస్‌ఆర్‌ పోషణ పథకం కింద 77 గిరిజన మండలాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా 26.36 లక్షలు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మొత్తం రూ.1555.56 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

అమరావతి

వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా గర్భిణీలు, బాలింతలు, 36 నెలల్లోపు పిల్లలు, 36 నుంచి 72 నెలల్లోపు పిల్లలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్న బాలింతలు, గర్భిణీలతో పాటు, 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాన్ని, అంగన్‌వాడీల్లో అదనపు పోషకాహారం అందించేందుకు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం అమలు చేయనున్నారు. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్‌ఆర్‌ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్‌ఆర్‌ బాల సంజీవనికి అదనంగా వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకాలను అమలు చేయనున్నారు.

వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం:
పోషణ ప్లస్‌ పథకాన్ని 77 గిరిజన, సబ్‌ ప్లాన్‌ మండలాల పరిధిలోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులతో పాటు 8320 అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు. ఈ పథకంలో 66 వేల మంది గర్భిణీలు, బాలింతలకు నెలలో 25 రోజుల పాటు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు.
టేక్‌ హోమ్‌ న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 2 కిలోల మల్టీ గ్రెయిన్‌ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అర కిలో రాగి పిండి, అర కిలో బెల్లం, అర కిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం ఒక్కో లబ్దిదారునికి నెలకి రూ.1100 చొప్పున 66 వేల మందికి మొత్తం రూ.87.12 కోట్లు ఖర్చు చేయనున్నారు.
36 నుంచి 72 నెలల లోపున్న 1.64 లక్షల పిల్లలకు 25 రోజుల పాటు వేడి వేడి అన్నం అందిస్తారు. అందులో భాగంగా అన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలతో పాటు 200 మిల్లీ లీటర్ల పాలు, కోడి గుడ్డు, 50 గ్రాముల బాలామృతం లడ్డు ఇస్తారు. దీని కోసం ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.553 చొప్పున 1.64 లక్షల మందికి రూ.108.83 కోట్లు ఖర్చు చేయనున్నారు.
6 నుంచి 36 నెలలలోపున్న 1.50 లక్షల పిల్లలకు టేక్‌ హోం న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 2.5 కిలోల బాలామృతం, 30 కోడి గుడ్లు, 6 లీటర్ల పాలు అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కొక్కరిపై నెలకు రూ.620 చొప్పున మొత్తం రూ.111.60 కోట్లు ఖర్చు చేయనున్నారు.
వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం కింద 77 గిరిజన మండలాల్లో మొత్తం 3.80 లక్షల లబ్ధిదారులపై రూ.307.55 కోట్లు ఖర్చు చేయనున్నారు.

వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం:
వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం 77 గిరిజన మండలాల మినహా రాష్ట్ర వ్యాప్తంగా 47,287 అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు.
ఈ పథకంలో భాగంగా 5.80 లక్షల గర్భిణీలు, బాలింతలకు నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, కోడి గుడ్లు సరఫరా చేస్తారు,
టేక్‌ హోమ్‌ న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, కిలో రాగి పండి, 250 గ్రాముల బెల్లం, మరో 250 గ్రాముల ఎండు ఖర్జూరం, కిలో సజ్జ పిండి అందిస్తారు. దీని కోసం ఒక్కొక్కరిపై నెలకు రూ.850 చొప్పున 5.80 లక్షల లబ్ధిదారులపై మొత్తం రూ.591.60 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
ఇక 36 నుంరి 72 నెలల్లోపు ఉన్న 7.06 లక్షల పిల్లలకు నెలలో 25 రోజులు అన్నం, పప్పు, ఆకుకూరలు లేదా కూరగాయలు, పాలు, కోడి గుడ్డు, స్నాక్స్‌ ఇవ్వనున్నారు. వాటన్నింటి కోసం నెలకు ఒక్కొక్కరిపై రూ.350 చొప్పున, 7.06 లక్షల లబ్ధిదారులపై మొత్తం రూ.296.52 కోట్లు ఖర్చు చేస్తారు.
అదే విధంగా 6 నుంచి 36 నెలల లోపున్న 13.50 లక్షల పిల్లలకు టేక్‌ హోం న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 2.5 కిలోల బాలామృతం, 25 కోడి గుడ్లతో పాటు, 2.5 లీటర్ల పాలు సరఫరా చేస్తారు. వాటి కోసం నెలకు ఒక్కొక్కరిపై రూ.412 చొప్పున మొత్తం రూ.667.44 కోట్లు ఖర్చు చేయనున్నారు.
వైయస్సార్‌ పోషణ పథకంలో మొత్తం 26.36 లక్షల లబ్ధిదారులపై ప్రభుత్వం రూ.1555.56 కోట్లు ఖర్చు చేయనుంది.

గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా…
గత ప్రభుత్వం ఐదేళ్లలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు కేవలం రూ.2761 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే ఏటా సగటున కేవలం రూ.500 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఇక వైయస్సార్‌సీపీ ప్రభుత్వం తొలి ఏడాది (2019–20)లోనే రూ.1076 కోట్లు ఖర్చు చేయగా, రెండో ఏడాది (2020–2021)కి సంబంధించి రూ.1863.11 కోట్లు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు కేటాయించింది. అంటే ఏటా సగటున దాదాపు రూ.1900 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
గత ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడిపై సగటున నెలకు రూ.210 ఖర్చు చేయగా, ఈ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో బాలింతలు, గర్భిణిలపై నెలకు సగటున రూ.1100 ఖర్చు చేస్తోంది. అదే విధంగా 36 నుంచి 72 నెలల మధ్య ఉన్న చిన్నారుల్లో ఒక్కొక్కరిపై నెలకు సగటున రూ.553 ఖర్చు చేస్తుండగా, 6 నుంచి 36 నెలలలోపు పిల్లల్లో ఒకొక్కరిపై నెలకు సగటున రూ.620 వ్యయం చేస్తోంది.
ఇంకా మైదాన ప్రాంతాల్లో బాలింతలు, గర్భిణిల్లో ఒక్కొక్కరిపై నెలకు సరాసరి రూ.850 ఖర్చు చేస్తుండగా, 3 నుంచి 6 నెలల లోపు ఉన్న పిల్లల్లో, ఒకొక్కరిపై నెలకు సగటున రూ.350 ఖర్చు చేస్తున్నారు. అదే విధంగా 6 నుంచి 36 నెలలలోపు ఉన్న పిల్లలలో ఒక్కొక్కరిపై నెలకు సరాసరి రూ.412 వ్యయం చేస్తున్నారు.
రక్తహీనత ఉన్న గర్భిణీ, బాలింతల్లో 2.69 లక్షల మందికి మాత్రమే గత ప్రభుత్వం టేక్‌ హోం రేషన్‌ ఇవ్వగా, ఈ ప్రభుత్వం రెండేళ్లు కూడా గడవక ముందే 6.46 లక్షల గర్భిణీలు, బాలింతలకు ఆ రేషన్‌ పంపిణీ చేస్తోంది.

నాడు–నేడు:
నాడు–నేడు కార్యక్రమంలో స్కూళ్ల తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం రూ.4 వేల కోట్లతో 10 రకాల మౌలిక వసతులు కల్పించనున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలు..
– వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం ద్వారా 77 గిరిజన మండలాల్లో లబ్ధి పొందుతున్న గర్భిణీలు, బాలింతల సంఖ్య 66 వేలు.
– వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పథకం ద్వారా గిరిజనేతర మండలాల్లో లబ్ధి పొందుతున్న గర్భిణీలు, బాలింతల సంఖ్య 5.80 లక్షలు.
– వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం ద్వారా 77 గిరిజన మండలాల్లో 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు లబ్ధిదారులు 1.50 లక్షలు.
– వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా గిరిజనేతర మండలాల్లో 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు లబ్ధిదారులు 13.50 లక్షలు.
– వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం ద్వారా 77 గిరిజన మండలాల్లో 3–6 సంవత్సరాల లోపు లబ్ధిదారులు 1.64 లక్షలు.
– వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 77 గిరిజనేతర మండలాల్లో 3–6 సంవత్సరాలలోపు లబ్ధిదారులు 7.06 లక్షలు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: