రాశి ఫలాలు

రాశి ఫలాలు
Spread the love

రాశి ఫలాలు

🐐 మేషం
ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపయోగపడతాయి. ద్వితీయ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
శుభకాలం. ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు.
విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
అందరినీ కలుపుకొని పోవడం అవసరం. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోవద్దు. ఆంజనేయ దర్శనం శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారాస్తోత్రం చదివితే బాగుంటుంది.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఆటంకాల వల్ల శ్రమ అధికం అవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. నవగ్రహ ఆలయ దర్శనం శుభప్రదం.
💃💃💃💃💃💃💃

⚖ తుల
మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.
ఆదిత్య హృదయం చదవాలి.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి.
నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
దైవబలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్నిసాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. సాయిబాబా దర్శనం శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మసిద్ధి ఉంది.చతుర్ధ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి విశ్రాంతి అవసరం.
చంద్ర శ్లోకం చదువుకోవాలి.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవంతు

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: