రైతు మెడపై కేంద్రం కత్తి – వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
కేంద్ర వ్యవసాయ, విద్యుత్ బిల్లులపై తీవ్ర అభ్యంతరం తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
రైతు మెడపై కేంద్రం కత్తి
- కార్పోరేట్ల లబ్దికొరకే ఇది ఉపయోగపడుతుంది
- రాష్ట్రాలకు సమాచారం లేకుండా బిల్లు సమాఖ్య స్ఫూర్థికి విరుద్దం
- తెలంగాణలో 92.05 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే
- ఈ బిల్లులో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతుధర ఊసేలేదెందుకు ?
- రైతుల ఉత్పత్తులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే భవిష్యత్ లో కార్పోరేట్లు గుత్తాధిపత్యం పెరిగి ధరల నియంత్రణ రైతు, ప్రభుత్వాల చేయి దాటి కార్పోరేట్ శక్తుల చేతిలోకి వెళ్లదా ? – కార్పోరేట్లకు, రైతులకు వివాదాలు తలెత్తితే పరిష్కరించేదెవరు … మార్కెట్ కమిటీలకున్న మధ్యవర్తిత్వ అవకాశాన్ని ఈ బిల్లు కాలరాసింది నిజమే కదా
- కొత్త బిల్లుతో మార్కెట్ కమిటీలు అలంకార ప్రాయం కానున్నాయి .. రైతుల తరపున మాట్లాడే గొంతుకలు నొక్కివేయబడ్డట్లే
- వివాదాలు తలెత్తినప్పుడు సాధారణ రైతు బడా కార్పోరేట్ వ్యవస్థను ఎలా ఢీ కొనగలడు ?
- రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం వ్యవసాయ వాణిజ్యం, సరఫరా, పంపిణీ వ్యవస్థ, వ్యవసాయ ఉత్పత్తుల ధరల నియంత్రణ కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి పరిధిలో ఉంటాయి .. కానీ ఈ బిల్లు విషయంలో ఏకపక్షంగా ముందుకువెళ్లింది .. రాజ్యాంగ స్ఫూర్థికి విరుద్దంగా బిల్లులను ఆమోదింపచేసుకుంది .. అది కూడా రాజ్యసభలో ఓటింగ్ పెట్టకుండానే
- లాభాపేక్ష తప్ప ఏ మాత్రం మానవత్వం ఉండని విదేశీ, స్వదేశీ బహుళజాతి కంపెనీలు, వ్యాపారులు గ్రామీణ పేద రైతాంగం మీదకు ఎగబడేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది
- మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేయడం ద్వారా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ఏ విధంగా భర్తీచేస్తుంది ?
- నిత్యావసరచట్టం పరిధి నుండి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, నూనెగింజలు, పప్పుధాన్యాలను తొలగించడం ద్వారా కార్పోరేట్లు, దళారులకు రెడ్ కార్పెట్ పరిచినట్లే
- ధరలు తక్కువ ఉన్పప్పుడు బ్లాక్ చేసి, వినియోగం పెరిగినప్పుడు ధరలు పెంచి అమ్ముతారు
- ప్రభుత్వ నియంత్రణలో ఉన్నా ఇప్పుడే ఉల్లి ధరలను నియంత్రించలేని పరిస్థితులు ఉంటున్నాయి .. మరి ప్రభుత్వ నియంత్రణనే లేకుంటే దళారులు, కార్పోరేట్లు చెలరేగిపోరా ?
- ప్రస్తుత అవసరాల రీత్యా తెలంగాణ ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను బలోపేతం చేసింది .. ఈ బిల్లు ప్రకారం గోదాంలు, మార్కెట్లను కార్పోరేట్లకు ధారాదత్తం చేసేలా ఉంది
- ఈ బిల్లు మూలంగా రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకోగలరు అని చెబుతున్నది .. కానీ వారు ఇంకా అసంఘటితంగానే ఉన్నారు .. ఇది కార్పోరేట్ వ్యవస్థలు దోచుకోవడానికి తోడ్పడదా ?
- కేంద్రం ప్రకటించే మద్దతుధరకే చట్టబద్దత లేదు .. ఇక దేశంలో ఎక్కడైనా ధర ఉన్నచోటికి రైతులు తీసుకెళ్లి తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు అన్నది ఆచరణలో సాధ్యమయ్యేదేనా ?
- గ్రామాలు, రాష్ట్రాలు దాటి రైతులు అమ్ముకునే పరిస్థితి లేదు .. రెక్కాడితే గాని డొక్కాడని సన్న, చిన్నకారు రైతులు తమ పంటలను నిల్వ చేసుకుని అమ్ముకునే పరిస్థితి కూడా లేదు
- తాజా బిల్లుతో కార్పోరేట్ వ్యవస్థ పడగవిప్పితే రైతాంగం మరింత నష్టపోయేలా ఉంది
- కార్పోరేట్ వ్యవస్థ, వ్యాపారులు, రిటైల్ చైన్స్, ప్రాసెసింగ్ యూనిట్ యజమానులు, దళారులు కుమ్మక్కై రైతులకు మద్దతు ధర దక్కకుండా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
- రైతులు పండించిన పంటలకు మద్దతుధర లభించేలా కేంద్రం చట్టబద్దత ఎందుకు కల్పించలేదు ?
- ఈ బిల్లులో ఉన్న వివాద పరిష్కార వ్యవస్థలలో స్పష్టత లేకపోగా లోప భూయిష్టంగా ఉంది .. దీనిపై రైతాంగం ఆందోళన చెందుతున్నది
- వ్యవసాయ బిల్లుతో పాటు విద్యుత్ బిల్లు లోపభూయిష్టం .. ఇది కూడా రాజ్యాంగ స్ఫూర్థికి విరుద్దం
- ఈ బిల్లులు సంస్కరణలుగా లేవు .. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెంచుకునే ప్రయత్నంలా ఉంది
- రాష్ట్రాలు కట్టిన పన్నుల వాటాలే కేంద్రం వెనక్కు ఇవ్వడం లేదు .. కరంటు బిల్లు కడితే తిరిగి ఇస్తామనడం విడ్డూరం
- రాష్ట్రాల అవసరాలను బట్టి విద్యుత్ రంగంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయి.. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవడం, రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోకపోవడం విచారకరం
- తెలంగాణ సాధించుకుని వ్యవసాయం బలోపేతం చేసేందుకు గత ఆరేళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం .. 26 లక్షల పంపుసెట్లకు ఉచిత కరంటు ఇస్తున్నాం .. కేంద్రం బిల్లు దీనికి విఘాతం కలిగించేలా ఉంది
- మీటర్లు బిగించడం, వాటి నిర్వహణ డిస్కంలకు పెద్ద భారంలా మారుతుంది
- అవసరం ఉన్న పేద రైతులకు, పేద కుటుంబాలకు రాష్ట్రాలు డిస్కంల ద్వారా క్రాస్ సబ్సిడీ భరించి కరంటును అందిస్తున్నాయి .. కేంద్ర బిల్లుతో అది సాధ్యం కాదు
- అల్పాదాయవర్గాలకు తక్కువ ధరకు కరంటు అందిస్తున్నాం .. ఇప్పుడు ఆ వ్యవస్థ అనేది ఉండదు .. వాణిజ్య, గ్రుహ, పారిశ్రామిక అవసరాలకు వివిధ రకాలుగా యూనిట్ కు ధర విధిస్తున్నాం .. కొత్త బిల్లు ప్రకారం ఈ రకమైన విభజన అనేది లేదు .. అందరూ యూనిట్ కు ఒకే ధర చెల్లించాలి
- ప్రస్తుతం ఎవరు తక్కువకు అమ్మితే వారితో డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి .. కేంద్ర బిల్లుతో ఆ వెసులుబాటు ఉండదు .. ఖచ్చితంగా వారు చెప్పినట్లే చేయాలి .. సెంట్రల్ పవర్ బోర్డు నియంత్రణ ప్రకారమే నడుచుకోవాలి
- కేంద్ర వ్యవసాయ, విద్యుత్ బిల్లులపై తీవ్ర అభ్యంతరం తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు