ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో వైసీపీనేతలు అవినీతి – Bonda Uma
ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో వైసీపీనేతలు రాష్ట్రవ్యాప్తంగా అంతులేని అవినీతికి పాల్పడ్డారు. Bonda Uma
రూ.4వేలకోట్ల వరకు దోపిడీ జరిగితే, ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదు?
వైసీపీ ప్రభుత్వం తక్షణమే ఇళ్లపట్టాల పేరుతో జరిగిన అవినీతిపై సీబీఐ, ఏసీబీ, సీబీసీఐడీ లేదా మరే సంస్థతోనైనా విచారణ జరిపించాలి.
పేదలకు అన్యాయం చేసేలా టీడీపీ వారు కోర్టుకెళ్లారని వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది.
ఏ నియోజకవర్గంలో టీడీపీ వారు ఇళ్లస్థలాల పంపిణీని అడ్డుకుంటూ కోర్టుకెళ్లారో ప్రభుత్వం బయటపెట్టాలి.
ప్రభుత్వంలోని అవినీతిని చూడలేక అధికారపార్టీకి చెందినవారే హైకోర్టుని ఆశ్రయించారు.
అనపర్తి నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ, వైసీపీ నేత కత్తిభగవాన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయలేదా?
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అవినీతిపై కలెక్టర్ కు లేఖరాసింది నిజం కాదా?
ఇళ్లస్థలాల అవినీతి బాగోతంలోని నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు త్వరలోనే టీడీపీతరుపున నిజనిర్ధారణ కమిటీ వేయబోతున్నాం.