అసలు ఎవరు ఈ గురువయ్య యాదవ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు.

అసలు ఎవరు ఈ గురువయ్య యాదవ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు.
Spread the love

అసలు ఎవరు ఈ గురువయ్య యాదవ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు.

కట్టెబోయిన గురువయ్య యాదవ్

కొన్నిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో మార్మోగుతున్న పేరు.

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థిగా కట్టెబోయిన గురువయ్య యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి రావటంతో రెండు రాష్ట్రాల ప్రజల చూపు ఒక్కసారిగా గురువయ్య యాదవ్ వైపు మళ్లింది.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నిడమానూరు మండలం వెనిగండ్ల గ్రామంలో ఒక మాములు మధ్యతరగతి కుటుంబం లో జన్మించిన వ్యక్తి శ్రీ కట్టబోయిన గురువయ్య యాదవ్ గారు.
కట్టెబోయిన లింగయ్య యాదవ్ బాలమ్మ దంపతులకు జన్మించిన ఐదుగురు సంతానంలో మొదటి సంతానం గురువయ్య యాదవ్ గారు.

చిన్నప్పటి నుంచే వ్యవసాయం లో తల్లి తండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసిన గురువయ్య యాదవ్ గారు అప్పట్లోనే ఉన్నత విద్యాబ్యాసం చేసి మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు.

తన తండ్రి గారైన లింగయ్య యాదవ్ గారు వెనిగండ్ల గ్రామానికి ఇరవై సంవత్సరాలు సర్పంచ్ గా పని చేయటంతో పాటు విద్యాకమిటీ చైర్మన్ గా కూడా పని చేసినందున గ్రామస్థాయి రాజకీయాలను తన చిన్నప్పటి నుంచే ప్రత్యక్షంగా చూసే అవకాశం గురువయ్య యాదవ్ గారికి కలిగింది.

శ్రీ గురువయ్య యాదవ్ గారి తెలివితేటలు, మంచితనం, కలివిడితనం చుసిన బీసీ వర్గాలకు ఆరాధ్య నాయకుడు అయిన దివంగత శాసనసభ్యులు శ్రీ గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ గారు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం జరిగింది.

తరువాత జరిగిన 1994 ఎన్నికలలో అప్పటి చలకుర్తి నియోజకవర్గం లో రాజకీయాలలో తలపండిన కుందూరు జానారెడ్డి గారి మీద రామ్మూర్తి యాదవ్ గారు పోటీ చేసి గెలవడం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఆ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది శ్రీ గురువయ్య యాదవ్ గారే. తెర వెనుక ఉంటూ ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుకుంటూ శ్రీ రామ్మూర్తి యాదవ్ గారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు.


తరువాత జరిగిన 1999, 2004 ఎన్నికలలో కూడా రామ్మూర్తి యాదవ్ గారి వెంట ఉంటూ మామగారికి తోడ్పాటు నందిస్తూ ఉన్నారు.

చిన్నతనం నుంచే తన తండ్రి రాజకీయ నైపుణ్యాన్ని పునికి పుచ్చుకున్న గురువయ్య యాదవ్ గారు తెరవెనుక వ్యూహాలు పన్నటంలో దిట్ట.

పాత చలకుర్తి నియోజకవర్గం లో ప్రతీ గ్రామంలో కూడా కొంతమందినైనా పేరు పెట్టి పిలవగలిగే అంత పరిచయాలు శ్రీ గురువయ్య యాదవ్ గారి సొంతం.

అంతే కాకుండా ఒక మాములు మధ్యతరగతి కుటుంబం లో జన్మించి వ్యాపార రంగంలో అడుగుపెట్టి విజయవంతం అయిన వ్యాపారవేత్తగా పేరు గడించటం జరిగింది. శ్రీ గురువయ్య యాదవ్ గారి కుటుంబం గురించి తెలుసుకున్న BMR గ్రూప్ సంస్థల అధిపతి, మాజీ శాసనసభ్యులు అయిన బీద మస్తాన్ రావు గారు తన కుమార్తె ను గురువయ్య యాదవ్ గారి కుమారుడు మాహితేజ్ యాదవ్ కి ఇచ్చి గురువయ్య యాదవ్ గారితో వియ్యం అందుకోవటం జరిగింది.

తెరాస రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారికి శ్రీ గురువయ్య యాదవ్ గారు స్వయానా తోడల్లుడు కావటం మరో విశేషం.

ఒక మాజీ శాసనసభ్యుడికి అల్లుడు, మరో రాజ్యసభ సభ్యుడికి తోడల్లుడు మరియు మరో మాజీ శాసనసభ్యుడు,ప్రముఖ వ్యాపారవేత్తకు వియ్యంకుడు అయినప్పటికీ ఎక్కడా కూడా అహంకారం ప్రదర్శించకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని భావిస్తూ ప్రతీ ఒక్కరినీ కూడా “తమ్మీ “అని ఆత్మీయంగా పిలవటం గురువయ్య యాదవ్ గారి సొంతం.

ఏ రోజు పదవులు ఆశించకుండా పార్టీ కోసం పని చేసుకుంటూ పోవటం గురువయ్య యాదవ్ గారి గొప్పతనం.

అటువంటి వ్యక్తి పేరు తెరాస నాయకత్వం పరిశీలనలో ఉండటంతో రెండు రాష్ట్రాల చూపు శ్రీ గురువయ్య యాదవ్ గారి మీదకు మళ్లింది.

మొదటి నుంచి రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం కావటం, స్థానికంగా పట్టున్న నేత కావటం,శ్రీ గురువయ్య యాదవ్ గారి మంచితనం మరియు వ్యూహాలు పన్నే నేర్పరితనం ఉండటం వలన కాంగ్రెస్ భీష్ముడు శ్రీ కుందూరు జానారెడ్డి గారికి పోటీగా సరైన అభ్యర్థిని తెరాస అధినాయకత్వం రంగంలోకి దించుతుంది అని అందరు చర్చించుకుంటున్నారు.

ఆల్ ది బెస్ట్ కట్టెబోయిన గురువయ్య యాదవ్ గారు…🤝

tanvitechs

tanvitechs

One thought on “అసలు ఎవరు ఈ గురువయ్య యాదవ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *