పకడ్బందీగా ఇంటింటా సర్వే. ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదు

Share this news

పకడ్బందీగా ఇంటింటా సర్వే

ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదు

ఆక్సిజన్ కు కొరత లేదు

24*7 వైద్యశాలలో అందుబాటులో ఆక్సిజన్

రేమిడిసివర్ గురించి అనవసరంగా ఆందోళన చెందకండి

పకడ్బందీగా ఇంటింటా సర్వే

ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదు

అనుమానితులు ఐసోలేషన్ కు వెళ్ళాలి

అందుబాటులో కిట్లు

వ్యాక్సిన్ సరఫరా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది

యాప్ లో నమోదు ఆధరంగానే వ్యాక్సిన్ టీకాలు

మంత్రి జగదీష్ రెడ్డి

కోవిడ్ పై సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశంహాజరైన మంత్రి జగదీష్ రెడ్డి

ఆక్సిజన్ కు ఎటువంటి కొరత లేదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

24*7 నడిచే ప్రతి ఆరోగ్య కేంద్రాలలో అక్షిజన్ అందుబాటులో ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. రేమిడిసివర్ గురించి అనవసరంగా ఆందోళనకు గురికావొద్దని ఆయన ప్రజలకు విజ్ణప్తి చేశారు కరోనా నివారణకు అదొక్కటే మందు కాదని ,అదొక మందు మాత్రామే నని ఆయన తేల్చిచెప్పారు. కోవిడ్ పై అనుసరించాల్సిన విధి విధానం తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం రోజున సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మోహన్ రావు,స్థానిక మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ,డి యం హెచ్ ఓ కోటాచలం, మెడికల్ కళాశాల సూపరెండేంట్ డాక్టర్ డి.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటింటా సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరినీ వదిలి పెట్టకుండా సర్వే నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. కరోనా అనుమానం వచ్చిన వారికి ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. అదే సమయంలో అనవసరంగా భయాందోళనకు గురి కావొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ సరఫరా విషయం పై ఆయన స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని వారు రూపొందించిన యాప్ లో నమోదు చేసుకున్న ప్రకారం వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *