నగరంలో 1,82,924 ఇళ్లలో పూర్తయిన ఫీవర్ సర్వే

నగరంలో 1,82,924 ఇళ్లలో పూర్తయిన ఫీవర్ సర్వే
Spread the love

నగరంలో 1,82,924 ఇళ్లలో పూర్తయిన ఫీవర్ సర్వే

కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 1,82,924 ఇళ్లలో సర్వే నిర్వహించారు. సోమవారంనుండి ప్రారంభమైన ఈ సర్వేలో ప్రతి రోజు జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ లకు చెందిన బృందాలు  ఇంటింటికి తిరిగి జ్వరం, కోవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్ద ఎత్తున చేపట్టాయి. ఒక్కో బృందంలో ఒక ఏ.ఎన్.ఎం, ఆశ వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్ తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి సర్వే ను చేపట్టారు. ఈ బృందాలు జ్వరం తో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు జ్వర కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ  లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు.

720 బృందాలతో 53002 ఇళ్లలో ఫివర్ సర్వే

  నగరంలో 720 బృదాలచే శుక్రవారం నాడు 53002 ఇళ్లలో సర్వేను నిర్వహించారు. ఒక్కో బృందంలో ఒక ఏ.ఎన్.ఎం, ఆశ వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్ తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి సర్వే ను చేపట్టారు. నగరంలో  ప్రతీ బస్తి  దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావఖానాలలో కోవిడ్ అవుట్ పేషంట్ కు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నేడు కూడా అన్ని ఆసుపత్రుల్లో18,772 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. కాగా జిహెచ్ఎంసి కాల్ సెంటర్ ద్వారా 140 మందికి కోవిడ్ సంబంధిత సలహాలు, సూచనలు వైద్యులు అందజేశారు.  
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *