చంద్రబాబుపై దేశ ద్రోహం కేసు పెట్టాలిః శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి

Spread the love

రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై దేశ ద్రోహం కేసు పెట్టాలిః శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్..

  • చంద్రబాబు దుష్ప్రచారం వల్లే.. తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు క్వారంటైన్ ఆంక్షలు విధించాయి.
  • మనిషి రూపంలో ఉన్న దెయ్యంలా.. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను చంపాలనుకుంటున్నారా..?
  • చెట్టు కింద కూర్చుని మాట్లాడే వాళ్ళలా దేశంలో చక్రం తిప్పిన చంద్రబాబు మాట్లాడటం ఏమిటి..?
  • సీఎం శ్రీ జగన్, ప్రభుత్వంపైన బండలు వేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు.
  • తెలుగు ప్రజలు అంటే అంటరానివారుగానో, రోగాన్ని తెచ్చే వారిగానో చంద్రబాబు దుష్ప్రచారం చేశారు
  • సైన్స్ చదవని చంద్రబాబు ఖాళీగా కూర్చుని వైరస్ పై చిల్లర రాజకీయాలా..?
  • సైన్స్ గురించి చంద్రబాబు మేధావిలా మాట్లాడుతున్నాడు
  • రాష్ట్ర పరిధిలో లేని వ్యాక్సిన్ లపైనా చంద్రబాబు చెత్త రాజకీయం, ప్రజలను రెచ్చగొడుతున్నాడు
  • చంద్రబాబుకు ఏ శిక్ష వేయాలో పౌరసమాజం, మేధావులు, ప్రజలు ఆలోచించాలి
  • కేంద్రం వ్యాక్సిన్లు సరఫరా చేస్తే.. రోజుకు 6 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వేసే సత్తా ఏపీకే ఉందని నిరూపించాం

ఎన్ 440కె స్ట్రెయిన్ అనే కొత్త వైరస్ ఆంధ్రప్రదేశ్ నుంచే వ్యాప్తి చెందిందని కనీస అవగాహన లేకుండా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారం వల్లే ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలను దేశంలోని వేరే రాష్ట్రాల్లో అవమానకరంగా చూస్తూ, ఆంక్షలు విధించే పరిస్థితి వచ్చిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… మిడిమిడి జ్ఞానంతో ఎవరైనా సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే, వారిని దండించాల్సిన రాజకీయ అనుభవం, వయసు, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి పదవిలో ఉన్న చంద్రబాబే ఇటువంటి చిల్లర రాజకీయాలకు పాల్డడితే.. అతన్ని ఏం చేయాలో, ఎలా దండించాలో, ఏ శిక్ష విధించాలో.. ఈ రాష్ట్రంలోని పౌర సమాజం, మేధావులు, ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలి, ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అని ఒకవైపు ప్రజలు ఆందోళనలు చెందుతున్న వేళ.. ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా, సమాజం పట్ల కనీసం బాధ్యత కలిగిన పౌరుడిగా కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడకపోగా, కేవలం జగన్ మోహన్ రెడ్డిగారిపై ఉన్న రాజకీయ కక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై నిందలు మోపుతూ, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. లేని వైరస్ ను ఉన్నట్టు సృష్టించి, అది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులోనే పుట్టిందని, ఆ వైరస్ చాలా ప్రమాదకరమని తన అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుష్ప్రచారం చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వచ్చే ప్రయాణికులను 14 రోజులపాటు క్వారంటైన్ కు పంపాలని ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయని తెలిపారు. ఇందుకు చంద్రబాబే కారణం అన్నారు. ఇంతకంటే బాధ్యతారాహిత్యం ఏమైనా ఉంటుందా..? అని చంద్రబాబుపై సజ్జల మండిపడ్డారు.

ఒక మనిషిగా కాకుండా, మనిషి రూపంలో ఉన్న దెయ్యంలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఇటువంటి దుష్ట నాయకుడ్ని మోస్తున్నందుకు సిగ్గు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు రాష్ట్ర పరిధిలో లేని వ్యాక్సినేషన్ సరఫరా, నియంత్రణ, మోనిటరింగ్ పై, రోజూ అబద్ధాలు చెబుతూ, మీరెందుకు చేయరు అని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తద్వారా ప్రజలను రెచ్చగొట్టి, వారిని మరింత అభద్రతాభావానికి, భయాందోళనళకు గురి చేస్తున్నారని సజ్జల ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు అన్నా, ప్రభుత్వం అన్నా చంద్రబాబుకు లెక్కలేకుండా పోయిందని చెబుతూ.. పదే పదే తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి చొప్పించి, వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే దుష్ట రాజకీయం చేస్తున్నారని విమర్శించారు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *