ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 21,320 పాజిటివ్ కేసులు.. 99 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 14,75,372కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 9,580 మంది మృతి చెందారు. కరోనా నుంచి 12,54,291 మంది కోలుకోగా.. రాష్ట్రంలో 2,11,501 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.