(21-05-2021) రాశి ఫలితాలు

(21-05-2021) రాశి ఫలితాలు
Spread the love

(21-05-2021) రాశి ఫలితాలు

మేషం
ప్రారంభించినపనులలో అవరోధాలు ఉన్నపటికీసకాలంలో పూర్తిచేస్తారు. సంతానంతో కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు దూర ప్రయాణాలు వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం
ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తాయి.

మిధునం
ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడతారు. పాత బుణాలు కొంత వరకు తీరుస్తారు. నూతన పరిచయాల వలన ఆర్ధికలాభాలుపొందుతారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిదికాదు. కుటుంబసభ్యులు నుండి వ్యతిరేకతపెరుగుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం
కొన్ని వ్యవహారాలలో ఇంట బయట సమస్యలు కలుగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత బాధ కలిగిస్తుంది. అదాయం ఆశించిన విధంగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

సింహం
కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లబ్ది పొందుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారమున ఆప్తుల నుంచి పెట్టుబడులు అందుతాయి. స్థిరాస్తి వివాదాలుపరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు అందుతాయి.0

కన్య
చుట్టుపక్కలవారితో ఊహించని విభేదాలు కలుగుతాయి ధన వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.

తుల
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నతఅవకాశములు లభిస్తాయి.

వృశ్చికం
దూర ప్రాంతాల బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలులో విజయం సాధిస్తారు. స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబసభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారుల ఆదరణ పెరుగుతుంది.

ధనస్సు
దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలలో నిర్వహిస్తారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి.

మకరం
అకారణంగా కుటుంబ సభ్యులతో వివాదలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యడం మంచిది. కుటుంబ వాతావరణం మరింత చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్ధిక ఇబ్బందులు వలన శిరో బాధలు పెరుగుతాయి నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

కుంభం
ఉద్యోగమున అదనపు బాధ్యతలనుండి ఉపశమనం లభిస్తుంది. నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది . దీర్ఘ కాలిక రుణాల తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు వ్యాపారము సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

మీనం

సన్నిహితుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమములు ప్రారంభిస్తారు. ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.


Spread the love

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *