🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌
30, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
వైశాఖమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము భాను వాసరే
( ఆది వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹
⚜️
శివ రామ గోవింద నారాయణ మహాదేవా
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్
⚜️
రాశి ఫలాలు
🐐 మేషం
ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. మీ మీ రంగాల్లో విజయం సొంతమవుతుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఇంటగెలిచి రచ్చగెలుస్తారు.
చంద్ర గ్రహ అష్టోత్తరం పఠిస్తే మంచిది.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
శ్రమతోకూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగు ముందుకు వేయండి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆరోగ్యం కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
మంచి సమయం. కీలకమైన పనుల్లో తోటివారి సహకారం లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సూర్యాష్టకము చదివితే బాగుంటుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
మీ మీ రంగాల్లో శుభఫలితాలు అందుకుంటారు. సమయం అనుకూలంగా ఉండడం వల్ల పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. గణపతి స్తోత్రం చదవితే మంచి జరుగుతుంది.
💃💃💃💃💃💃💃
⚖ తుల
కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. తీసుకునే నిర్ణయాల్లో స్తిరత్వం ఉండదు. శని శ్లోకం పఠిస్తే మేలు జరుగుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఆర్థికపరంగా మేలు జరుగుతుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి.
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధనా శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతమైన వాతావరణం ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈